నిశబ్ధం రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన కోన!  

Kona Venkat Gives Clarity On Nishabdham - Telugu Anushka Shetty, Kona Venkat, Nishabdham, Ott Release

టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి నటించిన కొత్త సినిమా ‘నిశబ్ధం’ ఎప్పుడో షూటింగ్ ముగించుకుని రిలీజ్‌ను పలుమార్లు వాయిదా వేసుకుంటూ వచ్చింది.అయితే అతి కష్టం మీద ఏప్రిల్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూసిన చిత్ర యూనిట్‌కు కరోనా వైరస్ దిమ్మతిరిగేలా చేసింది.

 Kona Venkat Gives Clarity On Nishabdham

వరుసగా లాక్‌డౌన్ అమలులో ఉండటంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.దీంతో లాక్‌డౌన్ ముగియగానే ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

కానీ లాక్‌డౌన్ ముగిసినా కూడా ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే సంకేతాలు కనిపించడం లేదని, దీంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకే చిత్ర యూనిట్ ఆసక్తి చూపుతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపించాయి.అయితే ఈ వార్తలపై తాజాగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన కోన వెంకట్ క్లారిటీ ఇచ్చాడు.

నిశబ్ధం రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన కోన-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

నిశబ్ధం సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసేందుకే ఎక్కువ ఆసక్తి చూపుతున్నామని, కానీ ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తామని ఆయన అన్నారు.

దీంతో ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేదు కాబట్టి, నిశబ్ధం సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకే చిత్ర యూనిట్ ప్రయత్నిస్తుందని తెలుస్తోంది.

పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేస్తుండగా ఈ సినిమాలో మాధవన్, అంజలి, షాలినీ పాండే తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.మరి నిశబ్ధం చిత్రాన్ని థియేటర్స్‌లో చూస్తామా లేక సైలెంట్‌గా ఓటీటీలోనే చూస్తామా అని అనుష్క ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kona Venkat Gives Clarity On Nishabdham Related Telugu News,Photos/Pics,Images..