కోన మళ్ళి చెడగొట్టడా ?

కోన వెంకట్ పడిపోతున్నాడా ? ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి.బ్రూస్ లీ డిజాస్టర్ గా నిలిస్తే, త్రిపుర అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది.

 Kona Spoils Shankarabharanam ?-TeluguStop.com

ఇక నిన్న గాక మొన్న వచ్చిన అఖిల్ ది బ్రూస్ లీ పరిస్థితే.కోన కి అర్థం అవుతున్నా, కాకపోతున్నా, ఆయన రాసే రొటీన్ ఫార్ములా చాలా ముదిరిపోయింది.

బ్రహ్మానందం, ఆయనకు ఓక వింత పేరు.లాజిక్ లేని కామెడి సీన్లు.

ఇవే కోన బలంగా భావిస్తున్న బలహీనతలు.విషయం తగ్గి ప్రాస ఎక్కువ ఉంటోంది రాస్తున్న డైలాగ్స్ లో.అఖిల్ కథావస్తువు చాలా పెద్దది.దానికి స్క్రీన్ ప్లే ఇంకో లెవెల్ లో ఉండాలి.

లాజిక్, సిరియస్ నెస్ , ఇంటన్సిటి , ఇవన్ని ఉండాలి.ఇవేవి లేకుండా, అర్థంపర్థం లేని కామెడి సీన్లతో నవ్వించడానికి ప్రయత్నించాడు కోన.

ఇక ఇప్పుడు శంకరాభరణం విషయానికొద్దాం.ఫస్ గయారే ఒబామా అనే హిందీ సినిమాకు రీమేక్ ఇది.అక్కడ బ్లాక్బస్టర్ గా నిలిచిన ఈ చిత్రాన్ని తెలుగులో కోన రచించారు.దీన్ని కుడా తన ప్రాస డైలాగ్స్ తో, ఇరికించిన సన్నివేశాలతో రొటీన్ సినిమాలా చేసారని ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే డిసెంబర్ 4వ తేది వరకు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube