గొంతు పెంచిన కోమటిరెడ్డి ? ఎవరికి మూడిందో ?

కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు అనేది సర్వసాధారణంగా మారిపోయాయి.ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏ విషయంలోనూ ఏకాభిప్రాయంతో ఉన్నట్టుగా కనిపించడం లేదు.

 Komatireddy Venkatreddy, Telangana, Revanth Reddy, Pcc Chief, Sonia, Elections R-TeluguStop.com

ఈ కారణాలతో ఆ పార్టీ పరిస్థితి తెలంగాణలో ఘోరంగా తయారైంది.ఒకరిపై ఒకరు సొంత పార్టీ నేతలపై విమర్శలు చేసుకుంటూ,  పార్టీ పరిస్థితి మరింతగా దిగజార్చుతూ వస్తున్నారు.

హుజురాబాద్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కు ఘోరమైన ఓటింగ్ శాతం నమోదు కావడంతో,  ఇప్పుడు సీనియర్ నాయకులంతా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేసుకున్నారు.తాజాగా భువనగిరి ఎంపీ,  కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి పై పరోక్షంగా విమర్శలు చేస్తూ విరుచుకుపడ్డారు.

కామారెడ్డి ఎల్లారెడ్డి నుంచి తాను ఉద్యమాన్ని మొదలు పెడతాను అని,  రేపటి నుంచి తన సంగతి ఏంటో చూపిస్తానని వెంకట్ రెడ్డి చెప్పుకొచ్చారు.కాంగ్రెస్ అంటే తనకు ప్రాణం అని సోనియా గాంధీ తనకు దేవత అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.

  ఈ సందర్భంగా రేవంత్ ను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు చేశారు .అప్పుడు సోనియా దెయ్యం అని ఇప్పుడు దేవత అంటున్నారని వెంకట్ రెడ్డి విమర్శించారు.పెద్ద లీడర్లు అని చెప్పుకుని పదవులు పంపకాలు చేసుకున్నారంటూ విమర్శలు చేశారు.కాంగ్రెస్ కు 72 78 సీట్లు వస్తాయని మంత్రులు, ముఖ్యమంత్రి పదవులు అప్పుడే పంపకాలు చేసుకుంటున్నారు అంటూ విమర్శలు చేశారు.

Telugu Congress, Hujurabad, Komati Venkat, Pcc, Revanth Reddy, Sonia, Telangana-

ఏపీలో కాంగ్రెస్ లేదనుకుంటే 6000 ఓట్లు వచ్చాయని,,  తెలంగాణలో ప్రభుత్వం వస్తుందని చెప్పుకున్నా చేదు ఫలితాలు వచ్చాయని, గెలుపోటములు సహజమని కోమటిరెడ్డి పేర్కొన్నారు.అయితే వెంకట్ రెడ్డి పూర్తిగా రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నట్లు గా కనిపిస్తున్నారు.  గతం నుంచి రేవంత్ రెడ్డి పై అసంతృప్తితోనే ఉన్నారు.ఆయనకు పిసిసి అధ్యక్ష పదవి దక్కుకుండా వెంకటరెడ్డి ఎంతగానో ప్రయత్నాలు చేసినా, కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ వైపు మొగ్గు చూపింది.

మొదట్లో ఆయనపై విమర్శలు చేసినా,  ఆ తర్వాత సైలెంట్ గా వెంకటరెడ్డి ఉన్నారు.మళ్లీ ఎన్నికల ఫలితాలు తర్వాత రేవంత్ ను పరోక్షంగా విమర్శిస్తూ వార్తల్లో ఉంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube