తెలంగాణా ప్రభుత్వం పై నిప్పులు చెరిగిన కోమటి రెడ్డి

తెలంగాణా ప్రభుత్వం,టీఆర్ఎస్ పార్టీ పై కాంగ్రెస్ సీనియర్ నేత కోమటి రెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు.ఇటీవల ఇంటర్ ఫలితాలలో విఫలమైనామంటూ 23 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య కు పాల్పడిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

 Komatireddy Fire On Trs Party-TeluguStop.com

ఈ నేపథ్యంలో కోమటి రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వం పై మండిపడ్డారు.చేతకాని ప్రభుత్వం వల్లే ఆ 23 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు అంటూ కోమటి రెడ్డి వ్యాఖ్యానించారు.

ఆ 23 మంది ఉసురు తగిలి సీ ఎం కేసీఆర్ నాశనమైపోతారు అని అన్నారు.

ఇంటర్ ఫలితాలు సరిగా ప్రకటించలేని కేసీఆర్,పీఎం అవుతారా అంటూ ఎద్దేవా చేసారు.

కమీషన్లు వచ్చే వాటిపైనే కేసీఆర్ సమీక్షలు చేస్తారంటూ కోమటి రెడ్డి విమర్శించారు.చెరో రూ.50 లక్షలు తీసుకున్న అశోక్, విజేందర్రావులు.గ్లోబరీనాకు టెండర్ ఇచ్చారని, ఒక అసమర్ధ మంత్రి విద్యాశాఖ మంత్రి కావడం తెలంగాణా ప్రజల దురదృష్టం అని ఆయన వ్యాఖ్యానించారు.

మరోపక్క ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల పై వివరణ ఇవ్వాలని కోరుతూ గత ఐదు రోజులుగా బీజేపీ నేత లక్ష్మణ్ నిరాహారదీక్ష చేపట్టారు.అయితే ఈ రోజు ఆయన తన దీక్షను విరమించినట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube