మ‌ళ్లీ సైలెంట్ అయిన కోమ‌టిరెడ్డి.. చేసిన స‌వాల్‌ను మ‌రిచారా..?

రాజ‌కీయాల్లో రాణించాలంటే ప్ర‌జ‌ల్లో ఒక బ‌ల‌మైన న‌మ్మ‌కం ఉండాలి.ఒక మాట నేత‌ల నోటి నుంచి వ‌చ్చిందంటే దానికి క‌ట్టుబ‌డి ఉన్న‌ప్పుడే ఆయ‌న్ను ప్ర‌జ‌లు న‌మ్ముతారు.

 Komati Reddy Who Is Silent Again .. Did You Forget The Challenge .., Komati Redd-TeluguStop.com

అంతేగానీ పూట‌కో మాట మాట్లాడితే ప‌ట్టించుకోరు.ఈ విష‌యం సుదీర్ఘ రాజ‌కీయ అనుభవం ఉన్న కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌కు తెలియ‌నిది కాదు.

ముఖ్యంగా కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్య‌లు ఇటు తెలంగాణ‌లోనే కాకుండా ఢిల్లీ కాంగ్రెస్‌కు కూడా ఇబ్బందిక‌రంగా మారింది.ఆయ‌న రేవంత్‌రెడ్డి మీద మొద‌టి నుంచే విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

ఇక త‌న‌కు టీపీసీసీ చీఫ్ ప‌ద‌వి ఇవ్వ‌లేద‌నే బాధ ఎంత ఉన్నా అది త‌న లోప‌ల దాచుకుని ఉంటే స‌రిపోయేది.కానీ ప్ర‌తి దానికి రేవంత్‌ను నిందించ‌డంతో ఆయ‌న మీద సొంత పార్టీ నేత‌లే గుర్రు మీద ఉన్నారు.

ఇక మొన్న‌టికి మొన్న కామారెడ్డి నుంచే త‌న స‌త్తా చూపిస్తాన‌ని, పాదయాత్ర చేస్తానంటూ స‌వాల్ విసిరారు.రాష్ట్ర వ్యాప్తంగా త‌న ప్ర‌భావాన్ని చూపిస్తానంటూ చెప్పిన కోమ‌టిరెడ్డి ఏమైందో ఏమోగానీ మ‌ళ్లీ సైలెంట్ అయిపోయారు.

రేవంత్ ప్రమాణ స్వీకారం నాడే ఓ మాట చెప్పారు.పార్టీలో వ్య‌క్తిగ‌త నిర్ణ‌యాలు, నినాదాలు ఉండొద్ద‌ని గట్టిగానే చెప్పారు.

Telugu Congress, Delhi Congress, Komatireddy, Revanth Reddy, Tg Congress, Tg, Ts

అయితే అలాంటి వాటిని కోమటిరెడ్డి పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌ట్లేదు.త‌న నినాదం త‌నదే అన్న‌ట్టు సాగుతున్నారు.పార్టీ ఇస్తున్న పిలుపుల‌ను కూడా పెద్ద‌గా స‌క్సెస్ చేయ‌ట్లేదు.అయితే త‌న స‌త్తా చూపిస్తాన‌న్న వ్య‌క్తి మ‌ళ్లీ ఎందుకు సైలెంట్ అయ్యార‌నే వాద‌న వినిపిస్తోంది.ఆయ‌న బ‌లం చూపిస్తే అంతిమంగా పార్టీకి అయినా మంచి జ‌రుగుతుంది క‌దా.ఎందుకు ఆ దిశ‌గా అడుగులు వేయ‌ట్లేద‌నే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి.

ఏదేమైనా కూడా కోమ‌టిరెడ్డి ఇలాంటి స‌వాళ్ల‌ను విసిరి మ‌ళ్లీ సైలెంట్ అయిపోతే ఎలా అంటూ చాలామంది కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లే చ‌ర్చించుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube