తెలంగాణ కాంగ్రెస్ లో పరిస్థితులు ఎప్పుడు సానుకూలంగా ఉండవు.ఎప్పుడు ఏదో ఒక వివాదం పార్టీలో చోటు చేసుకుంటూనే ఉంటుంది.
కీలకమైన ఎన్నికల సమయంలోనూ నాయకులు అలక చెందడం , సొంత పార్టీ నేతలపై విమర్శలు చేయడం, ఇలా ఎప్పుడు ఇదే రకమైన పరిస్థితి ఉంటూ ఉంటుంది.ప్రస్తుతం మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నికలు రాబోతున్నాయి.
ఇక్కడ కాంగ్రెస్ నుంచి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరడంతో పాటు, కాంగ్రెస్ కు రాజీనామా చేశారు.దీంతో ఇక్కడ ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి .ఎన్నికల్లో గెలిచేందుకు బిజెపి, కాంగ్రెస్ ,టిఆర్ఎస్ పార్టీలు పోటీ పడుతున్నాయి.ఈ సమయంలో రాజగోపాల్ రెడ్డి సోదరుడు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం చర్చనీయాంశం గా మారింది.
ఆయన సొంత పార్టీ నేతలపై విమర్శలు చేస్తూ, కీలక సమావేశాలకు హాజరు కాకపోవడంతో ఆయన పార్టీలో ఉంటారా బయటకు వెళ్తారా అనే అనుమానాలు అందరిలోనూ మొదలయ్యాయి.
ప్రస్తుతం ఎన్నికలు జరగబోతున్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం ఇస్తున్న భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉంది.
కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీతో వెంకటరెడ్డి భేటీ కాకముందు తాను మునుగోడులో ఎన్నికల ప్రచారానికి వచ్చేదే లేదు అంటూ ప్రకటించారు.అయితే ప్రియాంక గాంధీతో చర్చలు జరిపిన తర్వాత ఎన్నికల ప్రచారానికి వస్తున్నట్లు ప్రకటించారు .దీంతో అంతా సర్దుమనిగింది అని భావిస్తుండగా ఆయన మాత్రం పార్టీ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు.కొద్ది రోజుల క్రితం గాంధీభవన్ లో మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక ఎన్నికల ప్రచారంపై కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించింది.
ఈ సమావేశాలకు వెంకటరెడ్డి దూరంగా ఉన్నారు.మునుగోడు లో బిజెపి నుంచి పోటీ చేయబోయేది సొంత తమ్ముడు కావడంతో, ఆయనకు వ్యతిరేకంగా ఎలా ప్రచారం చేయాలనే సందిగ్ధం లో రాజగోపాల్ రెడ్డి ఉన్నట్లు సమాచారం.

అందుకే మునుగోడులో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు కీలక సమావేశాల్లో పాల్గొనేందుకు వెంకటరెడ్డి అంత ఆసక్తి చూపించడం లేదని పార్టీలో చర్చ జరుగుతోంది.ప్రస్తుతం మునుగోడు ఎన్నికల దృష్ట్యా ప్రతి గ్రామానికి కాంగ్రెస్ ఇన్చార్జిలను నియమించింది.సీనియర్ నేత మూడు గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం నిర్వహించే విధంగా షెడ్యూల్ రూపొందించారు.3 వ తేదీన పిసిసి మాజీ చీఫ్ ఉత్తంకుమార్ రెడ్డి, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, మునుగోడులో మీడియా మాట్లాడాలని నిర్ణయించారు.ఆ సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా వస్తారని పార్టీ నేతలు భావిస్తుండగా వెంకట్ రెడ్డి మాత్రం ఆ ఆలోచనలో ఉన్నట్టు కనిపించడం లేదు.ఆయన కనుక ఆ సమావేశానికి రాకపోతే , పార్టీ కేడర్ కూడా అయోమయానికి గురవుతారని కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు .కానీ తన నిర్ణయం ఏమిటనేది వెంకటరెడ్డి బయటపడకుండా జాగ్రత్త పడుతుండడంతో ఈ ఉత్కంఠ నెలకొంది.