కోమటరెడ్డి కొనసాగేనా?  

Komati Reddy Rajagopal Reddy Comments On Pcc Chief Change In Telangana-komati Reddy Rajagopal Reddy,telangana Congress

ఎమ్మెల్యే కోమటరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడం ఖాయం అంటూ కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి.కాంగ్రెస్‌ నాయకులు మరియు విధానాలపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చాడు.

KOmati Reddy Rajagopal Comments On PCC Chief Change In Telangana-Komati Telangana Congress

కాంగ్రెస్‌ నుండి బయటకు వచ్చి బీజేపీలో జాయిన్‌ అవ్వాలనుకున్న ఆయన ప్రస్తుతం బీజేపీకి కూడా దూరంగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది.తెలంగాణలో టీఆర్‌ఎస్‌ తర్వాత స్థానం బీజేపీకే దక్కుతుందని ఆయన భావించాడు.

అందుకే బీజేపీలో జాయిన్‌ అవ్వాలని ఆశించాడు.

బీజేపీ నుండి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో చేసేది లేక మళ్లీ కాంగ్రెస్‌లోనే కొనసాగాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

అయితే పీసీసీ ప్రెసిడెంట్‌ను తొలగించాలనే విషయాన్ని ఆయన పెద్ద ఎత్తున లేవనెత్తుతున్నాడు.అధినాయకత్వం వద్ద ఆయనకు మంచి పట్టు ఉంది.గతంలో ఎంపీగా చేసిన సమయంలో పార్టీ అధినాయకత్వంతో పరిచయాలు పెంచుకున్నాడు.ఆ కారణంగా పీసీసీ చీప్‌ పదవిని కూడా కోరుకున్నాడు.

కాని పార్టీ రాష్ట్ర నాయకులు మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు.దాంతో రాష్ట్ర నాయకులను ఆయన టార్గెట్‌ చేస్తూనే ఉన్నాడు.

తాజా వార్తలు