కేసీఆర్‌ విషయంలో జగన్‌కు కోమటిరెడ్డి సలహా  

Komati Reddy Give The Suggestion To Jagan-komati Reddy,komati Reddy Comments On Jagan,telangana Cm Kcr

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పదే పదే తెలంగాణ సీఎం కేసీఆర్‌ ను కలవడంను ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తప్పుబట్టాడు.మీకు మీ నాన్నకు ఉన్న మంచి పేరును కార్మిక ద్రోహి అయినటువంటి కేసీఆర్‌ను కలిసి చెడగొట్టుకోవద్దంటూ కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

Komati Reddy Give The Suggestion To Jagan-komati Reddy,komati Reddy Comments On Jagan,telangana Cm Kcr-Komati Reddy Give The Suggestion To Jagan-Komati Komati Comments On Jagan Telangana Cm Kcr

మీ నాన్నగారు చేసిన మంచి పనులు మరియు మీరు పడ్డ కష్టం కారణంగా సీఎం అయ్యావు.ఏపీకి నీ నుండి మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను.నువ్వు ఖచ్చితంగా ఏపీ ప్రజల నమ్మకంను నిలబెట్టాలని కోరుకుంటున్నాను.ఆర్టీసీ కార్మికుల వ్యధలు పట్టకుండా, వారి మరణాలకు కారణం అవుతున్న కేసీఆర్‌ నమ్మక ద్రోహి అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాడు.

Komati Reddy Give The Suggestion To Jagan-komati Reddy,komati Reddy Comments On Jagan,telangana Cm Kcr-Komati Reddy Give The Suggestion To Jagan-Komati Komati Comments On Jagan Telangana Cm Kcr

డ్రైవర్లు బలిదానాలు చేస్తున్నా కూడా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్న కేసీఆర్‌ తో జగన్‌కు స్నేహం ఏమాత్రం కరెక్ట్‌ కాదని ఈ సందర్బంగా కోమటిరెడ్డి అన్నాడు.తానే జగన్‌ను ఏపీ సీఎంగా గెలిపించినట్లుగా కేసీఆర్‌ భావిస్తున్నాడని, నెలకు ఒకసారి పిలిపించుకుని తెగ ఫీల్‌ అవుతున్నాడంటూ కేసీఆర్‌పై విమర్శలు చేశాడు.

ఏపీలో లోటు బడ్జెట్‌ ఉన్నా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు.కాని తెలంగాణలో మిగులు బడ్జెట్‌ ఉన్నా కూడా ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయడం లేదని ఈ సందర్బంగా కోమటిరెడ్డి ఆరోపణలు గుప్పించాడు.