మ‌రోసారి రేవంత్‌ను టార్గెట్ చేసిన కోమ‌టిరెడ్డి.. అక్క‌డి నుంచే స‌త్తా చూపిస్తాడంట‌

తెలంగాణ‌లోని ఏ పార్టీలో ఉండ‌న‌న్ని వ‌ర్గ విభేదాలు కేవ‌లం కాంగ్రెస్ లో మాత్ర‌మే క‌నిపిస్తుంటాయి.ఈ విభేదాలు రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ ఇచ్చిన త‌ర్వాత మ‌రింత పెరిగిపోయాయి.

 Komantireddy, Who Once Again Targeted Rewanth, Seems To Be Showing His Strength-TeluguStop.com

ఆయ‌న్ను విమ‌ర్శించే వారు కాంగ్రెస్ లోనే ఎక్కువ‌యిపోతున్నారు.ఇక మ‌రీ ముఖ్యంగా కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి అయితే ఓ రేంజ్లో రెచ్చిపోతున్నారు.

ఆయ‌నకు టీపీసీసీ చీఫ్ ప‌ద‌వి ఇవ్వ‌క‌పోవ‌డంతో రేవంత్ ను నిత్యం టార్గెట్ చేస్తూనే ఉన్నారు.మొన్న‌టి దాకా కాస్త సైలెంట్ గాక‌నిపించిన ఆయ‌న ఇప్పుడు మ‌రోసారి నిప్పులు చెరిగారు.

రేవంత్ పై విమ‌ర్శల బాణం ఎక్కుపెట్టారు.

రేవంత్‌కు పార్టీ ప‌గ్గాలు ఇచ్చిన‌ప్ప‌టి నుంచి పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్న కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి హుజూరాబాద్ ఫలితాన్ని మ‌రింత వాడేస్తున్నారు.

ఈ ఓట‌మి ఫ‌లితాన్ని రేవంత్ రెడ్డి భుజాన వేసుకోవ‌డంతో కోమ‌టిరెడ్డి మ‌రింత రెచ్చిపోతున్నారు.ఒక‌ప్పుడు సోనియాగాంధీని దెయ్యం అన్న వారే ఇప్పుడు దేవత అని కొలుస్తున్నారంటూ ఇన్ డైరెక్టుగా రేవంత్ మీద కౌంట‌ర్ వేశారు.

అప్పుడే కాంగ్రెస్ కు రాబోయే ఎన్నిక‌ల్లో 72నుంచి 78 వ‌ర‌కు ఎమ్మెల్యే సీట్లు వస్తాయంటూ చెబుతున్నార‌ని ఇప్ప‌టి నుంచే ఎవ‌రికి ఏ మంత్రి ప‌ద‌వి కావాలో పంచేసుకుంటున్నారిన విమ‌ర్శించారు.

Telugu Bjp, Etala Rajender, Huzurabad, Komativenkat, Rewanth, Trs, Ts Congress,

క‌నీసం డిపాజిట్ కూడా తెచ్చుకోకుండా ఎలా గెలుస్తామంటూ ఎద్దేవా చేశారు.ఇక ఇదే స‌మ‌యంలో మ‌రోసారి పార్టీకి సంబంధం లేని మాట‌లు మాట్లాడారు.తాను రాబోయే రోజుల్లో కామారెడ్డి, ఎల్లారెడ్డి నుంచే త‌న స‌త్తా ఏంటో చూపిస్తానంటూ చెప్ప‌డం విశేషం.

అంటే పార్టీతో సంబంధం లేకుండా త‌న ప్ర‌యాణం ఉంటుంద‌ని చెప్ప‌క‌నే చెప్పేశార‌న్న‌మాట‌.అయితే తాను కాంగ్రెస్ లోనే ఉంటాన‌ని చెప్ప‌డం ఇక్క‌డ అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

ఏదేమైనా కూడా మ‌రోసారి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి రేవంత్ ను టార్గెట్ చేసిన‌ట్టు క్లియ‌ర్ గా క‌నిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube