సారంగాదరియా రచ్చకి ఫుల్ స్టాప్... శేఖర్ కమ్ములని కలిసిన కోమలి...

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి, నాగ చైతన్య జోడీగా లవ్ స్టొరీ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీ అవుతుంది.

 Komali Met Sekhar Kammula Kept Full Stop To Song Controversy, Folk Singer Komali-TeluguStop.com

ఫిదా సినిమాలో వచ్చిండే సాంగ్ తో సాయి పల్లవి తెలుగు ప్రేక్షకులని ఎంత మాయ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆ సాంగ్ సెన్సేషన్ హిట్ అయ్యి సినిమాకి హైప్ తీసుకొచ్చింది.

ఈ నేపధ్యంలో సాయి పల్లవి డాన్స్ టాలెంట్ ని మరోసారి ఉపయోగించుకోవాలని శేఖర్ కమ్ముల తెలంగాణ జానపదం నుంచి సారంగాదరియా సాంగ్ ని తీసుకొచ్చి సినిమాలో ఉపయోగించుకున్నారు.ఈ సాంగ్ పల్లవి తీసుకొని చరణాలు > సుద్దాల అశోక్ తేజ చేత రాయించి పాటని మంగ్లీతో పాడించి రిలీజ్ చేశారు.

ఇక యుట్యూబ్ లో రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సాంగ్ అద్బుతమైన హిట్ కొట్టి రికార్డ్ స్థాయి వ్యూస్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది.ప్రస్తుతం సోషల్ మీడియాలో మోస్ట్ ట్రెండింగ్ సాంగ్ గా ఈ పాట ఉంది.

Telugu Folk Komali, Komali, Komalimet, Love Story, Naga Chaitanya, Sai Pallavi,

అయితే ఈ సాంగ్ ఎంత సూపర్ హిట్ అయ్యిందో దీని చుట్టూ వివాదం అంతే స్థాయిలో ఫేమస్ అయ్యింది.ఈ పాటని మొదటిసారిగా సేకరించి కోమలి అనే జానపద గాయని రేలా రే రేలా లో పాడింది.అయితే తాను సేకరించి పాడిన పాటకి కనీసం క్రెడిట్ కూడా ఇవ్వలేదని ఈ గాయని మీడియా ముందుకి వచ్చి రచ్చ చేసింది.సుద్దాల అశోక్ తేజ కూడా జానపదానికి ఎవరు వారసులు ఉండరని, ఎవరైనా వాడుకోవచ్చని చెప్పుకొచ్చారు.

అయితే ఫైనల్ గా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడుతూ శేఖర్ కమ్ముల ఓపెన్ లెటర్ రిలీజ్ చేశారు.అయినా మళ్ళీ ఎక్కడ రచ్చ అవుతుందేమో అని భావించిన శేఖర్ కమ్ముల ఆ జానపద గాయని కోమలిని పిలిపించి కలుసుకొని ఆమెకి నెక్స్ట్ సినిమాలో పాడే అవకాశం ఇస్తానని హామీ ఇవ్వడంతో పాటు ప్రీరిలీజ్ ఫంక్షన్ లో కూడా అవకాశం ఉంటే పాడిస్తానని ఒప్పించడంతో ఆమె కొద్దిగా కూల్ అయ్యింది.

కమ్యునికేషన్ గ్యాప్ వలన వివాదం ఇంత పెద్దగా అయ్యిందని, ఇక్కడితో సమస్య పరిష్కారం అయిపోయిందని శేఖర్ కమ్ముల మీడియాకి కోమలితో కలిసి తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube