కోలో కోలన్న కోలో సాంగ్ తో అదరగొడుతున్న నాని..

న్యాచులర్ స్టార్ నాని హీరోగా వస్తున్న సినిమా టక్ జగదీష్.శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది.

 Kolo Kolanna Kolo Song Released From Hero Nani Tuck Jagadish Movie, Kolo Kolanna-TeluguStop.com

వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే నిన్ను కోరి సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యింది.అందుకే ఈ సినిమాపై కూడా అభిమానులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ అయ్యింది.ఇది ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

శివ నిర్వాణ ఈ సినిమాను ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో నానికి జోడీగా రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

అయితే ఈ సినిమా నుండి తాజాగా ఒక పాటను విడుదల చేసారు.కోలో కోలన్న కోలో కొమ్మలు కిలకిల నవ్వాలి.అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది.ఈ పాటను రామ జోగయ్య శాస్త్రి రాసారు.

ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ పాటకు కూడా థమన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు.ఈ పాటతో ఎంతో మందికి స్ఫూర్తి నింపే విధంగా రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ అద్భుతంగా రాసారు.టక్ జగదీష్ నుండి విడుదలైన మొదటి పాటతోనే నాని అదరగొట్టేసాడు.

ఈ పాట మొత్తం ఫ్యామిలీతో సాగేలా చిత్రీకరించారు.ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

నాని కెరీర్ లో 26 వ సినిమాగా టక్ జగదీష్ రాబోతుంది.ఈ సినిమాలో జగపతిబాబు, నరేష్, నాజర్, రావు రమేష్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.అయితే ఈ సినిమాలో జగపతి బాబు పాత్రలో నెగిటివ్ షేడ్స్ కనిపిస్తాయని ఇప్పటికే తెలుస్తుంది.అయితే ఈ సినిమాను ఏప్రిల్ 23 న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube