ఎలాగైతే ఐకాన్ స్టార్ నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఆ యంగ్ డైరెక్టర్ తోనే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప.రష్మిక మందన్న నటించిన ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ అందుకుంది.350 కోట్ల రూపాయల వసూళ్లు అందుకుని పుష్ప 2021 లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఈ సినిమా తో పుష్పరాజ్ క్రేజ్ వరల్డ్ వైడ్ వైరల్ గా మారింది.

 Kollywood Young Director Atlee To Work With Allu Arjun For His Next, Allu Arjun,-TeluguStop.com

ఈ సినిమా రెండు పార్టులుగా రిలీజ్ అవ్వబోతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే పుష్ప ది రైజ్ పేరుతో మొదటి పార్ట్ ను రిలీజ్ చేయగా ఇక ఇప్పుడు పుష్ప ది రూల్ పేరుతో రెండవ పార్ట్ ను రెడీ చేస్తున్నాడు సుకుమార్.

ఈ సినిమాను మరింత బడ్జెట్ తో ప్రెస్టీజియస్ గా తెరకెక్కించ బోతున్నారు.ఇక ఇది ఇలా ఉండగా ఈయన నెక్స్ట్ సినిమా గురించి సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదొక వార్త వైరల్ అవుతూనే ఉంది.

 Kollywood Young Director Atlee To Work With Allu Arjun For His Next, Allu ARjun,-TeluguStop.com

ఇక తాజాగా అల్లు అర్జున్ నెక్స్ట్ లైనప్ గురించి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తుంది.ఈయన నెక్స్ట్ సినిమా కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ తో సినిమా తీస్తున్నాడు అంటూ టాక్ వస్తుంది.

ఆయన మరెవరో కాదు.టాలెటెండ్ డైరెక్టర్ అట్లీ కుమార్.

.ఈయన ప్రెజెంట్ బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తో సినిమా చేస్తున్నాడు.జవాన్ సినిమా ప్రెజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.ఈ సినిమాలో ఈయనకు జోడీగా నయనతార నటిస్తుండగా.దీపికా పదుకొణె కూడా కీలక పాత్రలో నటిస్తుంది.

Telugu Allu Arjun, Atlee Kumar, Kollywood, Kollywoodyoung, Jawan, Pushpa, Pushpa

ఇక అట్లీ ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.అల్లు అర్జున్ మార్క్ స్టైల్, యాక్షన్ అంశాలతో ఈ మూవీ స్క్రిప్ట్ ను అద్భుతంగా సిద్ధం చేసి అల్లు అర్జున్ తో సినిమా తీయనున్నాడట.మరి దీనిపై అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది.

అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత ఈ ప్రాజెక్ట్ ఉండనుందని వార్తలు వస్తున్నాయి.

Telugu Allu Arjun, Atlee Kumar, Kollywood, Kollywoodyoung, Jawan, Pushpa, Pushpa

ఇప్పటికే అల్లు అర్జున్ పుష్ప తర్వాత ఏం సినిమా చేయబోతున్నాడు అనే దానిపై పలు వార్తలు వచ్చాయి.పలువురు డైరెక్టర్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.ఈ క్రమంలోనే అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో కూడా సినిమా చేయబోతున్నాడు అంటూ ఈ మధ్య వార్తలు వచ్చాయి.

ఏది ఏమైనా ఈయన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వస్తేనే ఈ వార్తలకు చెక్ పడుతుంది.లేకపోతే ఏదొక రూమర్ వస్తూనే ఉంటుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube