అప్పట్లో ఆ హీరో మీద చాలా క్రష్ ఉండేదని అంటున్న తమిళ్ హీరోయిన్...

తెలుగులో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన “అన్నమయ్య” చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన “సీనియర్ హీరోయిన్ కస్తూరి” తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.ఈమె నటించింది ఒక్క సినిమానే అయినప్పటికీ తన అందం, అభినయంతో, ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది.

 Kasthuri, Kollywood Veteran Heroine, Kollywood, Nagarjuna, Tollywood King-TeluguStop.com

  అప్పట్లో అన్నమయ్య చిత్రం మంచి హిట్ అయినప్పటికీ తన మాతృభాష అయినటువంటి తమిళంలో సినిమా అవకాశాలు ఎక్కువగా రావడంతో ఈమె మళ్లీ తెలుగులో నటించ లేదు.

అయితే తాజాగా కస్తూరి టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ మరియు హీరో అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి విచ్చేసి తన అనుభవాల గురించి తెలియజేసింది.

ఇందులో భాగంగా టాలీవుడ్ కింగ్ నాగార్జున అంటే తనకు ఎంతో క్రష్ ఉండేదని అప్పట్లో తెలియజేసింది.అంతేగాక తనకు భారత ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ అంటే ఎంతో ఇష్టం అని అతడితో దిగినటువంటి ఫోటోలు కూడా ఫోటోలని చూపిస్తూ తన అభిమానాన్ని వ్యక్తం చేసింది.

అలాగే తాను అమెరికా కు చెందిన డాక్టర్ ని పెళ్లి చేసుకున్నానని ప్రస్తుతం తన భర్త అమెరికాలోనే ఉంటున్నాడని తెలిపింది.

అంతేగాక ప్రస్తుతం కస్తూరి యూట్యూబ్లో ఛానల్ ని క్రియేట్ చేసి క్యాస్టింగ్ కౌచ్ సమస్యలపై పోరాడుతున్నానని తెలిపింది.

అయితే ఈ విషయం గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే వచ్చే మంగళవారం వరకు ఆగాల్సిందే.ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కస్తూరి పలు కోలీవుడ్ చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.

అలాగే తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి “స్టార్ మా” లో ప్రసారమయ్యే “ఇంటిటి గృహ లక్ష్మి” అని ధారావాహికలో నటిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube