రామ్ లింగుస్వామి సినిమాలో విలన్ గా కోలీవుడ్ స్టార్ !

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ తో పాటు అందంతో కూడా కుర్రకారును కట్టిపడేస్తాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.ఎప్పుడు చాకోలెట్ బాయ్ లాగా ఉండే రామ్ ఒక్కసారిగా తన లుక్ మార్చేశాడు.

 Kollywood Star Madhavan In Ram Pothineni Lingusamy Movie,  Ram Pothineni, Kollyw-TeluguStop.com

చాలా రోజులుగా హిట్ లేక బాధపడుతున్న రామ్ టాలెంటెడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమాతో మాస్ లో కూడా మంచి ఫాలోయింగ్ అందుకున్నాడు రామ్ పోతినేని.

ఈ సినిమాలో రామ్ చెప్పిన మాస్ డైలాగ్స్ కు పూరీ సినిమాను టేకప్ చేసిన విధానం అన్ని కలిసి సూపర్ హిట్ అందుకున్నారు.ఈ సినిమా తర్వాత మరిన్ని మాస్ సినిమాల వైపే రామ్ పోతినేని మొగ్గు చూపుతున్నాడు.

ఈ సినిమా తర్వాత రామ్ ఈ మధ్యనే రెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమా మళ్ళీ ఆశించిన స్థాయిలో హిట్ అవ్వలేకపోయింది.కానీ వసూళ్లు పరంగా పర్వాలేదనిపించింది.

Telugu Kollywood, Lingusamy, Madhavan, Ram Pothineni-Movie

ఈ సినిమా తర్వా రామ్ పోతినేని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో ఒక సినిమా కమిటయ్యారు.పక్కా మాస్ సినిమాలను తెరకెక్కించే లింగుస్వామి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.దీంతో ఈ సినిమాపై ఒక్కసారిగా అటు కోలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లోను బాగా అంచనాలు పెరిగాయి.

ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన దగ్గర నుండి ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Telugu Kollywood, Lingusamy, Madhavan, Ram Pothineni-Movie

మాస్ సినిమాలను తెరకెక్కించే లింగుస్వామి రామ్ పోతినేని ని ఎలా చూపిస్తాడో అని అందరు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా అధికారికంగా ప్రకటించారు కానీ ఇంకా షూటింగ్ మొదలు పెట్టలేదు.అయితే ఈ సినిమా లో విలన్ గా ఎవరు చేస్తున్నారో అప్పుడే వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమాలో రామ్ పోతినేని ని డీ కొట్టడానికి కోలీవుడ్ స్టార్ మాధవన్ రెడీ అవుతున్నట్టు టాక్.మరి ఈ విషయంలో ఎంత నిజముందో వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube