అలాంటి చిత్రాల్లో రెమ్యూనరేషన్ తక్కువ ఇచ్చినా నటిస్తా...

తెలుగులో ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వం వహించిన “లక్ష్మీ” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైన కోలీవుడ్ బ్యూటీ నయనతార గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  ఈ అమ్మడు వచ్చీరావడంతోనే విక్టరీ వెంకటేష్ వంటి స్టార్ హీరో సరసన నటించే అవకాశం దక్కించుకున్న ఈ బ్యూటీ తెలుగులో దాదాపుగా సీనియర్ నుంచి జూనియర్ వరకు అందరి హీరోల సరసన నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.

 Kollywood Star Heroine Nayantara React About Her Remuneration, Kollywood Star He-TeluguStop.com

 అంతేగాక దాదాపుగా 15 సంవత్సరాలుగా కోలీవుడ్, టాలీవుడ్ సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది.

తాజాగా ఓ ప్రముఖ వార్తా పత్రిక నిర్వహించిన ఇంటర్వ్యూలో నయనతార పాల్గొంది.

 ఇందులో భాగంగా తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకుంది.ఇందులో ముఖ్యంగా మొదటగా తాను చార్టెడ్ అకౌంటెంట్ చదువు చదివి లైఫ్ లో సెటిల్ కావాలని అనుకున్నానని, కానీ అనుకోకుండా తెలిసిన వారి ద్వారా సినిమాల్లో నటించే అవకాశం రావడంతో  సినీ పరిశ్రమకి వచ్చానని చెప్పుకొచ్చింది.

తాను హీరోయిన్ గా నటించిన మనస్సినక్కరే అనే మలయాళ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ తన నటన కి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. దాంతో వరుసగా సినిమా అవకాశాలు రావడంతో  తన చదువు పై దృష్టి సారించ లేకపోయానని తెలిపింది.

ఇప్పటి వరకు తెలుగు, తమిళం మలయాళం, కన్నడ, తదితర భాషలలో కలిపి 50కి పైగా చిత్రాలలో నయనతార హీరోయిన్ గా నటించింది. దాంతో ప్రస్తుతం ఈ అమ్మడు తన పారితోషకం కంటే తన పాత్ర ప్రాధాన్యతకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తానని ఒకవేళ తన పాత్రకి ప్రాధాన్యత ఉన్నటువంటి అవకాశం వస్తే రెమ్యునరేషన్ తగ్గించుకుంటానని  తెలిపింది.

 అయితే ఈ  విషయం ఇలా ఉండగాసి ప్రస్తుతం నయనతార లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో దూసుకు పోతోంది. ఇందులో భాగంగా తమిళంలో ప్రస్తుతం నాలుగు చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube