డిజాస్టర్ టాక్ తో భారీ కలెక్షన్లు సాధించిన మాస్టర్..?

విజయ్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కి నిన్న తమిళంతో పాటు తెలుగులో విడుదలైన సినిమా మాస్టర్.డబ్బింగ్ మూవీ అయినప్పటికీ ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలోనే థియేటర్లు దక్కాయి.

 Kollywood Star Hero Vijay Master Movie First Day Collections,  Hero Vijay Master-TeluguStop.com

సినిమాకు ప్రేక్షకుల నుంచి డిజాస్టర్ టాక్ వచ్చినా మాస్ ప్రేక్షకులకు నచ్చే అంశాలు పుష్కలంగా ఉండటంతో తొలిరోజు ఈ సినిమాకు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి.
లాక్ డౌన్ వల్ల గతేడాది ఏప్రిల్ నుంచి థియేటర్లలో సినిమా చూసే అవకాశాన్ని మిస్ కావడంతో ప్రేక్షకులు సైతం థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలను చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు తొలిరోజే 5.74 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయని సమాచారం.50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లకు అనుమతులు ఇవ్వడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లు టికెట్ రేట్లను భారీగా పెంచాయి.

Telugu Crore Rupees, Alludu Adhurs, Day, Vijay Master, Kollywoodvijay, Master, M

మరోవైపు దిల్ రాజు ఈ సినిమా నైజాం హక్కులు తీసుకోవడం వల్ల భారీగా థియేటర్లు మాస్టర్ సినిమాకు లభించాయని సమాచారం.మాస్టర్ తొలిరోజే దాదాపు 80 శాతం పెట్టుబడిని కలెక్షన్ల రూపంలో మాస్టర్ రికవరీ చేసినట్టు తెలుస్తోంది.మాస్టర్ నైజాంలో కోటిన్నర, సీడెడ్ లో కోటీ 10 లక్షలు, ఉభయ గోదావరి జిల్లాల్లో కోటీ 4 లక్షల వైజాగ్ 83 లక్షలు, గుంటూరు 67 లక్షలు, కృష్ణా జిల్లాలో 36 లక్షలు, నెల్లూరు జిల్లాలో 25 లక్షల రూపాయల కలెక్షన్లు రాబట్టినట్టు సమాచారం.

అయితే తొలిరోజు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చినా నేడు రెడ్, అల్లుడు అదుర్స్ సినిమాలు విడుదల కావడంతో ఈరోజు నుంచి కలెక్షన్లు భారీగా తగ్గే అవకాశం ఉంది.రజనీకాంత్, సూర్యల స్థాయిలో కాకపోయినా విజయ్ కూడా తెలుగులో సినిమాకు మార్కెట్ ను పెంచుకుంటూ ఉండటం గమనార్హం.

సాధారణ ప్రేక్షకులను ఈ సినిమా మెప్పించలేకపోయినా విజయ్ ఫ్యాన్స్ కు నచ్చే అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉండటం గమనార్హం

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube