ఆసుపత్రికి వెళ్లిన కోలీవుడ్ స్టార్ హీరో అజిత్… ఆందోళనలో అభిమానులు….  

Kollywood Star Hero Ajith Caught In Hospital Video Viral In Social Media - Telugu Ajith, Hospital Video, Kollywood, Kollywood Star Hero, Shalini, Social Media

ప్రముఖ తమిళ నటుడు అజిత్ కుమార్ కి తమిళం, తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న  క్రేజ్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు.అయితే ఇతడి చిత్రాలు తెలుగులో కూడా మంచి మార్కెట్ ని సంపాదించుకున్నాయి.

 Kollywood Star Hero Ajith Caught In Hospital Video Viral In Social Media

తాజాగా హీరో అజిత్ కి సంబంధించినటువంటి ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అయితే ఇంతకీ ఆ ఆ వీడియో ఏంటంటే ఇటీవలె హీరో అజిత్ తన భార్య శాలినితో కలిసి తమిళనాడు రాష్ట్ర రాజధాని ఐన  చెన్నై నగరం లో ఉన్నటువంటి ఓ ఆస్పత్రికి మాస్కులు ధరించి వెళ్ళాడు.

ఆసుపత్రికి వెళ్లిన కోలీవుడ్ స్టార్ హీరో అజిత్… ఆందోళనలో అభిమానులు….-Latest News-Telugu Tollywood Photo Image

ఇది గమనించిన కొందరు స్థానికులు వెంటనే ఆసుపత్రిలో అజిత్ తిరుగుతున్న దృశ్యాలను తమ చరవాణిలో బంధించి  సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ప్రస్తుతం కొందరు నెటిజనులు ఈ వీడియోని తెగ ట్రోల్ చేస్తున్నారు.
 

అంతే గాక మరి కొంతమంది అయితే గత కొద్దికాలంగా లాక్ డౌన్ కారణంగా ఇంటి వద్దనే ఉండడంతో అజిత్ కొంతమేర అస్వస్థతకు గురయ్యాడని అందువల్లనే ఆసుపత్రికి వెళ్ళాడని చర్చించుకుంటున్నారు.మరికొందరు మాత్రం ఇటీవలే అజిత్ తండ్రి అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నాడని అందువల్ల అజిత్ తన తండ్రిని చూసేందుకు ఆసుపత్రికి వెళ్ళాడని అంటున్నారు.

కానీ అసలు నిజం ఏంటో ఇంకా తెలియాల్సి ఉంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అజిత్ కుమార్ ప్రముఖ దర్శకుడు వినోద్ దర్శకత్వం వహిస్తున్న వాలిమై అనే తమిళ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రాన్ని బాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత బోనీ కపూర్ నిర్మిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తయినట్లు సమాచారం.

ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో బాలీవుడ్ నటి  హుమా కురేషి నటిస్తుండగా ప్రతినాయకుడి పాత్రలో ఆర్ఎక్స్ 100 చిత్ర ఫెమ్ కార్తికేయ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు.కాగా ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం జనవరి నెలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test