తమిళ హాస్య నటుడు వివేక్ ఇకలేరు..!

ప్రముఖ తమిళ హాస్య నటుడు వివేక్ (59) శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు.అప్పటికే పరిస్థితి విషమించినట్టుగా వైద్యులు చెప్పారు.

 Kollywood Star Comedian Vivek Passed Away-TeluguStop.com

అయినా సరే వైద్యులు చికిత్స చేస్తూ వచ్చారు.అయినా సరే లాభం లేకుండాపోయింది.

వివేక్ శనివారం తెల్లవారుఝామున 4:30 గంటలకు తుది శ్వాస విడిచారు.కె.బాలచందర్ పరిచయం చేసిన నటులలో వివేక్ ఒకరు.దాదాపు 300 సినిమాలకు పైగా నటించిన వివేక్ తమిళంతో పాటు తెలుగు ఆడియెన్స్ కు సుపరిచితులు.

 Kollywood Star Comedian Vivek Passed Away-తమిళ హాస్య నటుడు వివేక్ ఇకలేరు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రజిని, కమల్, సూర్య, విక్రం, అజిత్ సినిమాల్లో కమెడియన్ చేస్తూ మెప్పించారు వివేక్.వివేక్ మరణ వార్త కోలీవుడ్ ను షాక్ అయ్యేలా చేసింది.ఆయన చేసిన సినిమాలు కొన్ని తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి ప్రేక్షకాదరణ పొందాయి.తమిళంలో స్టార్ కమెడియన్ గా ఎన్నో మంచి సినిమాల్లో నటించారు వివేక్.

ఆయన మృతి పట్ల తమిళ సినీ పరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది.

#Star Comedian #Kollywood #Vivek Died #KollywoodStar #Vivek

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు