త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమాలో విలన్ గా కోలీవుడ్ స్టార్

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కుతుంది.

 Kollywood Star Arya Negative Role For Ntr-TeluguStop.com

హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ లోనే ఈ సినిమా కూడా తెరకెక్కబోతుంది.ఇక పొలిటికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఇక జులై, ఆగష్టులో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.ఇక సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే ఖరారైనట్లు టాక్ వినిపిస్తుంది.

 Kollywood Star Arya Negative Role For Ntr-త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమాలో విలన్ గా కోలీవుడ్ స్టార్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే అఫీషియల్ ఇంకా ఈ విషయాన్ని రివీల్ చేయలేదు.ఇదే సమయంలో బాలీవుడ్ హీరోయిన్స్ పేర్లు కూడా ఈ సినిమా కోసం వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి తాజాగా మరో వార్త ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా వినిపిస్తుంది.

ఈ మధ్యకాలంలో ఒక బాషలో హీరోలుగా నటిస్తున్న వారు వేరొక బాషలో విలన్స్ గా కనిపించడానికి రెడీ అయిపోతున్నారు.

ఇప్పటికే కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి, సంజయ్ దత్, ఉపేంద్ర లాంటి హీరోలు అందరూ విలన్స్ గా కనిపించారు.ఒకప్పుడు హీరోలుగా నటించే వారు విలన్స్ గా నటించడానికి ఇష్టపడే వారు కాదు.

అయితే ఇప్పుడు ట్రెండ్ మారడంతో హీరోలు కూడా పాత్ర ప్రాధాన్యత బట్టి విలనిజం ప్రదర్శించడానికి ఒకే అంటున్నారు.ఈ నేపధ్యంలో ఇప్పటికే టాలీవుడ్ లో వరుడు సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య మరోసారి తెలుగులో విలన్ గా నటించడానికి ఒకే చెప్పినట్లు బోగట్టా.

ఎన్టీఆర్ సినిమాలో విలన్ పాత్ర కోసం త్రివిక్రమ్ అతన్ని సంప్రదించినట్లు తెలుస్తుంది.అతను కూడా చేయడానికి ఆసక్తిగానే ఉన్నాడనే మాట వినిపిస్తుంది.

#KollywoodStar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు