లేని గొప్పదనాన్ని చూపిస్తున్న తమిళులు.. ఇదే మనకు వారికి ఉన్న తేడా!

మనకు మనమే గొప్ప అని సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం ఎంత వరకు కరెక్ట్.తెలుగు వారు అయితే ఇందుకు విరుద్ధం అనే చెప్పాలి.

 Kollywood People Review On Ponniyin Selvan , Ponniyin Selvan , Mani Ratnam , Kol-TeluguStop.com

మన గొప్పదనాన్ని మనం గుర్తించకుండా మనల్ని మనమే తక్కువ చేసుకుంటాం అని మనకు అస్సలు స్వాభిమానం ఉండదని విమర్శలు మనమీద ఉన్నాయి.అయితే తమిళ్ ప్రేక్షకులు మాత్రం ఇందుకు విరుద్ధం అనే చెప్పాలి.

వారు వారి గొప్పలు వారే చెప్పుకుంటారు.

తమను మించి వేరేవారు ఎవరు లేరు అనే ఫీలింగ్ లో వారు ఉంటారు.

అయితే అసలు నిజమైన గొప్పలు చెప్పుకుంటే ఓకే కానీ.లేని గొప్పలు ప్రదర్శిస్తే కష్టం.

మరి ఈ మధ్య సినిమాల విషయంలో తమిళుల తీరు చూస్తుంటే ఇలానే అనిపించడం సహజం.ఒకప్పుడు కోలీవుడ్ నుండి మంచి మంచి సినిమాలు వచ్చాయి.

కానీ ఇప్పుడు చెప్పుకోదగ్గ సినిమాలు రావడం లేదు.అయినా కూడా తమిళ్ ప్రేక్షకులు ఆ సినిమాలనే సూపర్ హిట్లుగా చేస్తున్నారు.

తమిళ్ లో అన్నాత్తె సినిమా ఆ రేంజ్ లో ఆడింది అంటేనే అర్ధం అవుతుంది వీరు నాసిరకం సినిమాలను కూడా నెత్తిన పెట్టుకుని గొప్పలు చెబుతున్నారు అని.అక్కడ ప్రేక్షకులే కాదు క్రిటిక్స్ కూడా ఇలానే ఎక్కువ రేటింగ్స్ ఇచ్చేస్తూ పొగిడేస్తున్నారు.ఇక ఇప్పుడు వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది.క్రిటిక్స్ ఏకంగా 3.5 నుండి 4.5 రేటింగ్ ఇచ్చారంటేనే అర్ధం అవుతుంది.ఈ సినిమాను అద్భుతంగా అంటూ ఇలాంటి సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలోనే రాలేదంటూ చెప్పుకొచ్చారు.

Telugu Annatte, Bahubali, Kollywood, Kollywoodreview, Mani Ratnam, Ponniyin Selv

అయితే ఈ సినిమా చూసిన తెలుగు ప్రేక్షకులు వారి మాటలకూ ఆ సినిమాకు ఎలాంటి సంబంధం లేదని తెలిసి ఆశ్చర్య పోయారు.ఇలా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఈ రేంజ్ లో పొగిడేశారు.ఈ సినిమా చుసిన మన ప్రేక్షకులే కాదు క్రిటిక్స్ కూడా వారి రేటింగ్స్ చూసి దిమ్మతిరిగింది అనే చెప్పాలి.

బాహుబలి అంతటి విజయం సాధించిన సమయంలో కూడా మన వాళ్ళు అంతగా స్పందించలేదు.రేటింగ్స్ కూడా మామూలుగానే ఇచ్చారు.కానీ మన సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు గొప్పగా పొగిడారు.ఇక ఇప్పుడు తమిళులు మాత్రం పొన్నియన్ సెల్వన్ కు లేని గొప్పదనాన్ని యాడ్ చేసి మరీ చెబుతున్నారు.

అది మనకు తమిళులకు ఉన్న తేడా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube