ఆ నిర్మాతలు థియేటర్లు అంటే గజగజా వణుకుతున్నారా..?

కరోనా విజృంభణ వల్ల లాక్ డౌన్ నిబంధనలు అమలు కావడంతో దాదాపు ఎనిమిది నెలలు థియేటర్లు మూతబడిన సంగతి తెలిసిందే.థియేటర్లు మూతబడటంతో చాలామంది దర్శకనిర్మాతలు తమ సినిమాలను ఓటీటీల ద్వారా విడుదల చేయడానికి ఆసక్తి చూపారు.అయితే ఫిబ్రవరి 1 నుంచి థియేటర్లను 100 శాతం ఆక్యుపెన్సీతో ఓపెన్ చేయడానికి కేంద్రం అనుమతులు ఇచ్చింది.

 Kollywood Not Interested To Release Movies In Theatres-TeluguStop.com

100 శాతం ఆక్సుపెన్సీ వల్ల తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు కలకలలాడటంతో పాటు దర్శకనిర్మాతలు తమ సినిమాలను రిలీజ్ చేయడానికి రిలీజ్ డేట్లను ఫిక్స్ చేశారు.అయితే తెలుగు రాష్ట్రాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నా కోలీవుడ్ లో మాత్రం సినిమాలను థియేటర్లలో విడుదల చేసే విషయంలో దర్శకనిర్మాతలు టెన్షన్ పడుతున్నారు.సినిమాలను ఓటీటీలో విడుదల చేయడానికే ఆసక్తి చూపుతున్నారు.

కోలీవుడ్ దర్శకనిర్మాతలు సినిమాలను థియేటర్లలో విడుదల చేస్తే మునపటిలా కలెక్షన్లను సాధిస్తాయా.? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.కోలీవుడ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్న మూడు సినిమాలు ఓటీటీల్లోనే విడుదల కాబోతున్నాయని సమాచారం.ఆర్య, సయేషా జంటగా నటించిన టెడ్డీ మూవీ మార్చి నెల 12వ తేదీన డిస్నీ + హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుండటం గమనార్హం.

 Kollywood Not Interested To Release Movies In Theatres-ఆ నిర్మాతలు థియేటర్లు అంటే గజగజా వణుకుతున్నారా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Collections, Dhanush, Drishyam-2, Jagame Tantram, Kollywood, Live Streaming, Movie In Theatres, Not Interested, Ott, Teddy, Theaters, Tv Telecast-Movie

సముద్రఖని మెయిల్ రోల్ లో చేసిన ఎలే మూవీ అయితే ఏకంగా టీవీలోనే టెలీకాస్ట్ కానుండటం గమనార్హం.కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న జగమే తంత్రం అనే మూవీ కూడా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలవుతూ ఉండటం గమనార్హం.అయితే థియేటర్లు ఓపెన్ అయినా ఓటీటీలలో సినిమాలను విడుదల చేస్తూ ఉండటంపై థియేటర్ ఓనర్ల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.కోలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీల్లో కూడా ఇదే తరహా పరిస్థితి నెలకొంది.

మోహన్ లాల్ నటించిన దృశ్యం 2 కూడా ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే.

#Kollywood #Dhanush #Collections #Theaters #Tv Telecast

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు