ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఆ సింగర్ తో ప్రేమలో పడ్డాడట... నిజమేనా...

తమిళం, మలయాళం, తెలుగు, తదితర భాషలలో అద్భుతమైన సంగీత స్వరాలను సమకూర్చి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న కోలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ “అనిరుద్ రవిచందర్” గురించి తెలియనివారుండరు.కాగా అనిరుద్ సినిమా పరిశ్రమకి వచ్చిన కొద్ది సమయంలోనే దాదాపుగా స్టార్ హీరోల చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించి బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Kollywood Music Director Anirudh Love Affair With Singer Gossips Viral-TeluguStop.com

ఈ క్రమంలో నాని, రజినీ కాంత్, ధనుష్, అజిత్, విజయ్ తదితర స్టార్ హీరోల చిత్రాలకు సంగీతం అందించాడు.అయితే సినీ కెరీర్ పరంగా అనిరుద్ బాగానే గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ప్రేమాయణాలు విషయంలో కూడా ఈ మధ్య బాగానే పాపులర్ అవుతున్నాడు.

కాగా తాజాగా అనిరుద్ ప్రేమాయణానికి సంబంధించినటువంటి ఓ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అయితే ఇంతకీ ఆ విషయం ఏమిటంటే ఇటీవలె కోలీవుడ్ సినిమా పరిశ్రమకి చెందినటువంటి ఓ ప్రముఖ సింగర్ తో అనిరుద్ ప్రేమలో పడినట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

 Kollywood Music Director Anirudh Love Affair With Singer Gossips Viral-ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఆ సింగర్ తో ప్రేమలో పడ్డాడట… నిజమేనా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతేకాకుండా ఆ మధ్య అనిరుద్ ప్రముఖ సింగర్ తో కలిసి ఒక పాట కూడా పాడాడని ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు కొందరు చర్చించుకుంటున్నారు.అయితే అనిరుద్ ప్రేమాయణాల విషయంలో ఇలాంటి వార్తలు వినిపించడం కొత్తేమీ కాదు.

గతంలో కూడా కోలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ హీరోయిన్ తో అనిరుద్ డేటింగ్ చేస్తున్నట్లు అంతేకాకుండా ఆమెతో చనువుగా దిగిన ఫోటోలు కూడా బయటకు లీక్ అయినట్లు పలు వార్తలు వినిపించాయి.కానీ అనిరుద్ మాత్రం తనకు ఎలాంటి లవ్ ఎఫైర్లు లేవని కొట్టి పారేశాడు.

Telugu Anirudh, Kollywood Music Director, Kollywood Music Director Anirudh Love Affair With Singer Gossips Viral, Love Affair, Love Affair With Singer-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అనిరుధ్ రవిచందర్ కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్న “ఇండియన్ 2” చిత్రానికి సంగీత స్వరాలను సమకూరుస్తున్నాడు.అంతేకాకుండా ఇటీవలే టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న “ఆర్.ఆర్.ఆర్” చిత్రంలోని టైటిల్ సాంగ్ ని పాడి నటించాడు.ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్ లో బాగా ట్రెండింగ్ అవుతోంది.

#KollywoodMusic #Kollywood Music #Love #Love #Anirudh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు