ప్రకాష్ రాజ్ రాజకీయం తమిళ జనాలకి కోపం తెప్పించింది! ఎందుకంటే  

ప్రకాష్ రాజ్ పై బ్యాన్ విధించడానికి సిద్ధం అవుతున్న కోలీవుడ్ .

Kollywood Industry Try To Ban On Prakash Raj-

లోక్ సభ ఎన్నికలలో బెంగుళూరు లో స్వాతంత్ర్య అభ్యర్ధిలో స్టార్ నటుడు ప్రకాష్ రాజ్ పోటీ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. బెంగుళూరులో అతని గెలుపు మాట ఏమో కాని ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ తరుపునకి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేసాడు. ఇదిలా ఉంటే ఢిల్లీలో ఆప్ తరుపున ప్రచారం చేస్తూ తమిళ విద్యార్ధులకి, తమిళనాడు ప్రజలకి కోపం తెప్పించే వాఖ్యలు చేసారు..

ప్రకాష్ రాజ్ రాజకీయం తమిళ జనాలకి కోపం తెప్పించింది! ఎందుకంటే-Kollywood Industry Try To Ban On Prakash Raj

ఢిల్లీ యూనివర్సీటీలో సుమారు 500 మంది తమిళనాడు విద్యార్ధులు చదువుతున్నారని వీరి కారణంగా ఢిల్లీ విద్యార్ధులకి సీట్లు రాకుండా పోతున్నాయని అంటూ వాఖ్యలు చేసారు.

ఇదిలా ఉంటే తాజాగా ప్రకాష్ రాజ్ ఎన్నికల ప్రచారంలో రాజకీయంగా చేసిన ఈ వాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపాయి. ఈ వాఖ్యలని కొన్ని మీడియా సంస్థలు హైలెట్ చేయడంతో తమిళ విద్యార్ధుల నుంచి, చిత్ర పరిశ్రమ వరకు అందరూ ప్రకాష్ రాజ్ మీద గుర్రుగా ఉన్నారు. ఇక తమిళ ఇండస్ట్రీలో ప్రకాష్ రాజ్ సినిమాలు చేయకుండా బ్యాన్ చేయాలని ఇప్పుడు అక్కడ డిమాండ్ పెరుగుతుంది.

మరి ప్రకాష్ రాజ్ తానను చేసిన వాఖ్యలపై వివరణ ఇస్తాడా లేక తమిళ ప్రజల ఆగ్రహానికి గురవుతాడా అనేది చూడాలి.