ఎంగేజ్ మెంట్ పై స్పందించిన నయనతార....

టాలీవుడ్, కోలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో దాదాపుగా సీనియర్ నుంచి జూనియర్ వరకు అందరి స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ హీరోయిన్ “నయనతార” గురించి తెలుగు తమిళ సినీ పరిశ్రమలో తెలియనివారుండరు.అయితే నయనతార సినిమా జీవితం పరంగా బాగానే సంతృప్తి చెందినప్పటికీ తన వైవాహిక జీవితంలో మాత్రం పెద్దగా సంతోషంగా లేదు.

 Kollywood Heroine Nayanthara Clarify About Her Engagement With Vignesh Shivan, N-TeluguStop.com

కాగా అప్పట్లో కోలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ హీరో మరియు డాన్స్ కొరియోగ్రాఫర్ తో నయనతార ప్రేమలో పడిందనే తొందర్లోనే వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని పలు కథనాలు వినిపించినప్పటికీ అందులో ఏ మాత్రం నిజం లేదని నయనతారా కొట్టి పారేసింది.

దీంతో ప్రస్తుతం ఈ అమ్మడు తమిళ సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు “విగ్నేష్ శివన్” తో ప్రేమలో పడింది.

అంతే కాకుండా వీరిద్దరూ కలిసి గత కొద్ది కాలంగా డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం.అయితే ఎప్పుడూ మీడియాకి దూరంగా ఉండేటువంటి నయనతార తన వ్యక్తిగత జీవితం గురించి బయటి వ్యక్తులతో పంచుకోవడానికి పెద్దగా ఇష్టపడదు.

కానీ తాజాగా నయనతార ప్రముఖ టెలివిజన్ ఛానల్ అయిన విజయ్ టెలివిజన్ ఛానల్ లో ప్రసారం అయ్యే ఓ షోకి గెస్ట్ గా విచ్చేసింది.ఇందులో భాగంగా నయనతార తన ఎంగేజ్మెంట్ గురించి స్పందిస్తూ తన వేలికి ఉన్న ఉంగరాన్ని చూపించింది.

అంతేకాకుండా ఈ ఉంగరం తన నిశ్చితార్థపు ఉంగరం అని తెలిపింది.దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నయనతార తెలుగు, తమిళ భాషలలో వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.కాగా ప్రస్తుతం సౌత్ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటిస్తున్న “అన్నాథై” చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.అంతేకాకుండా తమిళ ప్రముఖ దర్శకుడు మిలింద్ రావ్ దర్శకత్వం వహిస్తున్న “నేత్రికనన్” అనే చిత్రంలో కూడా మెయిన్ లీడ్ పాత్రలో నటిస్తోంది.ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు కూడా పూర్తయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube