సినిమాలకు గుడ్ బై చెప్పనున్న యువ హీరో.. కారణం?

సిని ఇండస్ట్రీకి పరిచయం కావడానికి ఎంతో కష్టపడితేనే అవకాశాలు దొరుకుతాయి.అంతేకాకుండా ఇండస్ట్రీలో ఉండి ఓ మంచి గుర్తింపు తెచ్చుకునే వరకు కూడా ప్రయత్నిస్తూనే ఉండాలి.

 Kollywood Hero Udayanidi Stalis Says Good Bye To Movies Udaya Nidhi Stalin, Tami-TeluguStop.com

అలా కొందరు తమ ప్రయత్నంతో ముందుకెళ్తే మరికొందరు మంచి ఫేమ్ లో ఉన్న కూడా మధ్యలోనే ఇండస్ట్రీకి గుడ్ బై చెబుతున్నారు.ఇప్పటికే చాలా మంది యంగ్ హీరోలు తమకు అవకాశాలు లేకపోవడం వల్లనో లేదా మరో రంగం వైపు దృష్టి పెట్టడం వల్లనో ఇండస్ట్రీకి దూరమవుతున్నారు.

తాజాగా మరో యంగ్ హీరో కూడా సినిమాలకు గుడ్ బై చెప్పనున్నాడు.ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.

కోలివుడ్ హీరో ఉదయనిధి స్టాలిన్.ఈయన గురించి కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ ప్రేక్షకులు కూడా పరిచయమే.తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.ప్రస్తుతం వరుస సినిమాలలో బిజీగా ఉన్నాడు.

మంచి ఫామ్ లో ఉన్న ఉదయనిధి త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పనున్నాడట.దీంతో ఈ విషయం ప్రస్తుతం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఇక ఈయన సినిమాలకు దూరం కావడానికి కారణం ఏంటంటే.ప్రస్తుతం తన దృష్టి మొత్తం సినిమాలపై కాకుండా పాలిటిక్స్ పై ఉందని తెలుస్తుంది.

Telugu Poltics, Kolliwood, Kollywood, Tamil, Tollywood, Udayanidhi-Movie

ఇప్పటికే తన తండ్రి స్టాలిన్ తమిళనాడులో సీఎంగా ఉన్న సంగతి తెలిసిందే.ఇటీవలే తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందాడు ఉదయనిధి స్టాలిన్.దీంతో ఇకపై సినిమాలకు దూరంగా ఉండాలని. తన తండ్రి బాటలోనే నడవాలని అనుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ఈ విషయం గురించి ఉదయనిధి నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.ఇక ప్రస్తుతం ఈయన క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న కన్నే నంబతే లో నటిస్తున్నాడు.

అంతేకాకుండా ఆర్టికల్ 15 రీమేక్ లో కూడా నటించనున్నట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే సెల్వరాజ్ దర్శకత్వంలో కూడా మరో సినిమా చేయనున్నాడని తెలుస్తుంది.

బహుశా ఇదే తన చివరి సినిమా అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube