హీరో సూర్య కొడుకు, కూతురిని ఎప్పుడైనా చూసారా..?

కోలీవుడ్, టాలీవుడ్ తదితర చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా రాణిస్తున్న ప్రముఖ హీరో సూర్య గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే నటుడు సూర్య కి తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది.దీంతో ఆ మధ్య సూర్య హీరోగా నటించిన “ఆకాశమే నీ హద్దురా.!” చిత్రం కోలీవుడ్ లో పాటు టాలీవుడ్ లో కూడా మంచి విజయం సాధించింది.అయితే హీరో సూర్య తన సినీ జీవితంలో అంతగా విజయం సాధించడానికి ముఖ్య కారణంగా తన భార్య మరియు ఒకప్పటి హీరోయిన్ “జ్యోతిక” అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.అయితే 2006వ సంవత్సరంలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

 Kollywood Hero Surya Son And Daughter Photo Viral-TeluguStop.com

కాగా జ్యోతిగా కూడా అప్పట్లో టాలీవుడ్ లోని పలువురు స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి బాగానే రాణించింది.కానీ పెళ్లయిన తర్వాత సినిమాల పరంగా జోరు తగ్గించినప్పటికీ అడపాదడపా చిత్రాలలో నటిస్తూ బాగానే అలరిస్తోంది.

కాగా ప్రస్తుతం వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు.కొడుకు పేరు దేవ్ మరియు కూతురు పేరు దివ్య.

 Kollywood Hero Surya Son And Daughter Photo Viral-హీరో సూర్య కొడుకు, కూతురిని ఎప్పుడైనా చూసారా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇటీవలే జ్యోతిక తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా సూర్య తన కొడుకు కూతురుతో కలిసి దిగిన ఫోటోలని షేర్ చేసింది.దీంతో సూర్య అభిమానులు ఈ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు.

అంతే కాకుండా సూర్య కొడుకు, కూతురు చాలా క్యూట్ గా ఉన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.అయితే ఇప్పటి వరకు సూర్య తన కుటుంబ విషయాలను మరియు వ్యక్తుల గురించి సోషల్ మీడియాలో పెద్దగా షేర్ చేయలేదు.

దీంతో ఉన్నట్లుండి జ్యోతిక దివ్య మరియు దేవ్ ల ఫొటో లను షేర్ చెయ్యడంతో అభిమానులు తమ అభిమాన నటుడి కొడుకు, కూతురిని చూసి తెగ మురిసిపోతున్నారు.

Telugu Dev, Divya, Jyothika, Kollywood Hero, Kollywood Hero Suriya Son And Daughter Photo Viral, Suriya, Tollywood-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలె సూర్య హీరోగా నటించిన “ఆకాశమే నీ హద్దురా” చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది.దీంతో ప్రస్తుతం సూర్య “జై భీమ్” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రాన్ని దాదాపుగా 5 భాషలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.

అఇటీవలే ఈచిత్రానికి సంబంధించిన సూర్య ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.అలాగే సూర్య తమిళంలో ప్రముఖ దర్శకుడు “పాండిరాజ్” దర్శకత్వం వహిస్తున్న మరో చిత్రంలో కూడా హీరోగా నటిస్తున్నాడు.

#Jyothika #KollywoodHero #Suriya #Kollywood Hero #Divya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు