ప్రభాస్ ఆది పురుష్ లో లక్ష్మణుడుగా యువ హీరో  

Kollywood Hero Ready to Play Lakshmana role in Adipurush, Pan India Movie, Director Om Raut, Bollywood, Darling Prabhas, Adi purush, Atharva murali - Telugu Adi Purush, Atharva Murali, Bollywood, Darling Prabhas, Director Om Raut, Kollywood Hero Ready To Play Lakshmana Role In Adipurush, Pan India Movie

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ లో ఓం రావత్ దర్శకత్వంలో మైథాలజీ కథాంశంతో ఆది పురుష్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాని టి-సిరీస్ భారీ బడ్జెట్ తో విజువల్ గ్రాండియర్ గా ఆవిష్కరిస్తుంది.

TeluguStop.com - Kollywood Hero Ready To Play Lakshmana Role In Adipurush

పూర్తిగా గ్రీన్ మ్యాట్ స్టూడియోలో త్రీడీ టెక్నాలజీలో ఈ సినిమాని తెరకెక్కుస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడు పాత్రలో వారియర్ కింగ్ గా కనిపించబోతూ ఉండగా, లంకేశ్ రావణ్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో సీత పాత్ర కోసం ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నారు.ఇక ఇందులో దశరధుడు పాత్రలో కృష్ణంరాజు నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.

TeluguStop.com - ప్రభాస్ ఆది పురుష్ లో లక్ష్మణుడుగా యువ హీరో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

మిగిలిన క్యాస్టింగ్ గురించి ఎలాంటి క్లారిటీ లేకపోయినా తాజాగా ఈ సినిమా గురించి మరో ఆసక్తికర అప్డేట్ వినిపిస్తుంది.సినిమా కోసం ప్రస్తుతం ఆర్టిస్ట్ సెలక్షన్ జరుగుతుందని, ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ఇప్పటికే మొదలైనట్లు తెలుస్తుంది.

దర్శకుడు ఓం రావత్ ఈ సినిమా షూటింగ్ జనవరి తర్వాత ప్రారంభించడానికి రెడీ అవుతున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో లక్ష్మణుడు పాత్ర కోసం కోలీవుడ్ హీరో, గద్దలకొండ గణేష్ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన అధర్వ మురళీని ఫైనల్ చేశారని తెలుస్తుంది.

ఈ పాత్ర చెయ్యడానికి అతను కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సమాచారం.పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాని ఆవిష్కరిస్తున్నందున అందుకు తగ్గట్లే క్యాస్టింగ్ సెలక్షన్ ఉండేలా దర్శకుడు ఓం రావత్ చూసుకుంటున్నట్లు తెలుస్తుంది.

రామాయణంలో ఇప్పటి వరకు ఎవరూ చూడని కోణాన్ని దర్శకుడు ఇందులో ఆవిష్కరించబోతున్నారని టాక్ నడుస్తుంది.

#Atharva Murali #Darling Prabhas #Pan India Movie #Adi Purush #KollywoodHero

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kollywood Hero Ready To Play Lakshmana Role In Adipurush Related Telugu News,Photos/Pics,Images..