అభిమానులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన రజనీకాంత్.?

సూపర్ స్టార్ రజనీకాంత్ గత నెలలో రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించి అరోగ్య సమస్యలు, ఇతర కారణాల వల్ల రాజకీయాలకు దూరమైన సంగతి తెలిసిందే.మరోవైపు గత కొన్నిరోజుల నుంచి రజనీకాంత్ సినిమాలకు కూడా గుడ్ బై చెప్పే అవకాశం ఉందని కూడా వార్తలు వచ్చాయి.

 Kollywood Hero Rajanikanth Annatthe Movie Release Date Fixed-annthai-paddannaya-TeluguStop.com

సోషల్ మీడియాలో వచ్చిన వార్తల వల్ల అన్నాత్తే సినిమా షూటింగ్ కూడా ఆగిపోయిందా ? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

అయితే తాజాగా అన్నాత్తే సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ కావడంతో రజనీకాంత్ ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు.

ఈ ఏడాది నవంబర్ 4వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఈ సినిమా షూటింగ్ ఆలస్యంగా ప్రారంభం కానుందని అందుకే రిలీజ్ డేట్ నవంబర్ కు వాయిదా పడిందని తెలుస్తోంది.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

తెలుగు, తమిళ భాషల్లో అన్నాత్తే సినిమా తెరకెక్కుతోంది.తెలుగులో ఈ సినిమాకు అన్నయ్య లేదా పెద్దన్నయ్య అనే టైటిల్ ఫిక్స్ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.నయనతార, కీర్తి సురేష్, ఖుష్బూ ఈ సినిమాలో నటిస్తున్నారు.

తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదల కానుందని సమాచారం.రజనీకాంత్ ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు.

మాస్ సినిమాలకు ఎక్కువగా దర్శకత్వం వహించిన శివ ఈ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరించనున్నారని తెలుస్తోంది.సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తుండగా కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది.

రజనీకాంత్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నా సినిమాల్లో మాత్రం కొనసాగాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.అయితే అన్నాత్తే సినిమా తరువాత రజనీకాంత్ సినిమాల్లో నటిస్తారో లేదో తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube