కరోనా వైరస్ విజృంభణ, లాక్ డౌన్ వల్ల ఒకప్పుడు రాజభోగాలు అనుభవించిన వాళ్లలో కొంతమంది ప్రస్తుతం తినడానికి తిండి కూడా లేని దీనస్థితిని అనుభవిస్తున్నారు.ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే.
చలనచిత్ర పరిశ్రమపై కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది.కొంతమంది ఉద్యోగాలను కోల్పోతే మరికొందరు కరోనా వల్ల ఎదురైన ఆర్థిక సమస్యలకు భయపడి ఆత్మహత్య చేసుకుంటున్నారు.
కరోనా నిబంధనల వల్ల ప్రస్తుతం పరిమితి సంఖ్యలో సిబ్బంది మధ్యే షూటింగ్ లు సైతం జరుగుతున్నాయి.ప్రముఖ హాస్య నటులలో ఒకరైన ఇళంభారతి కలెక్టర్ ఆల్బీజాన్‌వర్గీష్ ను కలిసి తనను ఆదుకోవాలని వినతిపత్రాన్ని అందించారు.
ఇళం భారతి పదుల సంఖ్యలో సినిమాల్లో నటించి మంచి పేరును సంపాదించుకున్నారు.అయితే కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తర్వాత ఇళంభారతికి అవకాశాలు ఎక్కువగా రావడం లేదు.
సినిమాలు, సీరియల్ ఆఫర్స్ రాకపోవడం వల్ల తనకు తీవ్రస్థాయిలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఇళంభారతి చెప్పుకొచ్చారు.కలెక్టర్ ఇళంభారతి సమస్యను కచ్చితంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం.
ఇళంభారతిలా అవకాశాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్లు ఇండస్ట్రీలో చాలామందే ఉండటం గమనార్హం.ఆర్థిక కష్టాల్లో ఉన్న కొంతమందికి ఇండస్ట్రీ పెద్దలు తమ వంతు సహాయం చేస్తున్నారు.

మరోవైపు థియేటర్లు ఓపెన్ కాకపోవడం వల్ల కూడా సినిమా రంగంపై ప్రభావం పడుతోంది.కొంతమంది సినిమా రంగానికి చెందిన నటీనటులు తమదైన శైలిలో సాయం చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.కొంతమంది నటులు సినిమా ఆఫర్లు తగ్గడంతో వెబ్ సిరీస్ లపై దృష్టి పెడుతున్నారు.కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల సినీ పరిశ్రమకు వేల కోట్ల రూపాయల నష్టం వచ్చినట్టు తెలుస్తోంది.
కరోనా థర్డ్ వేవ్ గురించి వస్తున్న వార్తలు సినీ రంగానికి చెందిన వాళ్లను భయాందోళనకు గురి చేస్తున్నాయి.