తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన వాలిమై సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది.అసలైతే సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సి ఉన్నా ఆ సినిమా కరోనా పరిస్థితుల వల్ల వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.
వినోద్ డైరక్షన్ లో అజిత్ హీరోగా నటించిన వాలిమై సినిమాలో తెలుగు యువ హీరో కార్తికేయ విలన్ గా నటించాడు.అజిత్, కార్తికేయల మధ్య యాక్షన్ సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలిచేలా ఉన్నాయని తెలుస్తుంది.
ఆల్రెడీ వినోద్ తో పింక్ రీమేక్ గా నెర్కొండ పార్వాయి సినిమా డైరెక్ట్ చేసి అజిత్ కి సూపర్ హిట్ ఇచ్చాడు డైరక్టర్ వినోద్.
ఇక ఇప్పుడు వాలిమై వీరి కాంబోలో వస్తున్న రెండో సినిమా అని చెప్పొచ్చు.
ఈ సినిమా రిలీజ్ అవకుండానే అజిత్ తో వినోద్ మూడవ సినిమా కూడా ఓకే చేసుకున్నట్టు టాక్.అజిత్ కు డైరక్టర్ నచ్చితే వరుసగా రెండు మూడు సినిమాలు చేస్తాడు.
అలానే వినోద్ తో ఆల్రెడీ రెండు సినిమాలు చేసిన అజిత్ ఇప్పుడు హ్యాట్రిక్ సినిమాకు రెడీ అవుతున్నాడని తెలుస్తుంది.అయితే ఈసారి వీరి కాంబినేషన్ ఎలాంటి కథతో వస్తుంది.
అజిత్ వినోద్ హ్యాట్రిక్ మూవీ ఏ రేంజ్ లో ఉండబోతుంది లాంటి విషయాలు మాత్రం కొద్దిరోజుల్లో తెలుస్తుంది.