తనతో పడుకుంటే ఆ తెలుగు హీరోతో అవకాశం ఇప్పిస్తానంటూ హీరోయిన్ ని ...

ఈ మధ్య కాలంలో క్యాస్టింగ్ కౌచ్ మరియు లైంగిక వేధింపులు విషయంపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండటంతో కొందరు తాము ఎదుర్కొన్న సంఘటనల గురించి నిర్భయంగా మీడియా ముందుకు వచ్చి తెలియజేస్తున్నారు.ఈ క్రమంలో తాజాగా ప్రముఖ తమిళ నటి “షమ్ము షాలు”  కూడా తాజాగా తాను ఎదుర్కొన్న ఓ సంఘటన గురించి సోషల్ మీడియా మాధ్యమాలలో తెలియజేసింది.

 Kollywood Actress Shalu Shamu React About Tollywood Director Casting Couch-TeluguStop.com

ఇందులో ఇటీవలే తనని టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ దర్శకుడు సినిమా ఆఫర్ విషయమై తనని సంప్రదించాడని, ఈ క్రమంలో తనకు పడకగది కమిట్మెంట్ ఇస్తే టాలీవుడ్ సినిమా పరిశ్రమలోని ఓ స్టార్ హీరో చిత్రంలో అవకాశం ఇప్పిస్తానని ఆఫర్ చేశాడట.దీంతో ఒక్కసారిగా ఆ దర్శకుడు మాటలు వినగానే తాను అవాక్కయ్యానని షాలు షమ్ము పేర్కొంది.

దీంతో టాలీవుడ్ సినిమా పరిశ్రమపై తమిళ నటి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ దుమారం రేపుతున్నాయి.

అంతేకాక తనను పడకగది కమిట్మెంటు అడిగిన ఆ దర్శకుడు ఎవరో తెలియజేయాలని కొందరు నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

మరికొంతమంది అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది తమ లైంగిక కోరికలను తీర్చుకొనేందుకుగాను టాలీవుడ్ సినిమా పరిశ్రమ పేరును వాడుకుంటున్నారని ఇలాంటి వాళ్లని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా నటి షాలు షమ్ము ఈ మధ్యకాలంలో తను నటించిన  చిత్రాలతో కంటే ఎక్కువగా వివాదాలతోనే పాపులర్ అవుతోంది.

కాగా ఆ మధ్య తమిళంలో దర్శకుడు ఎమ్.రాజేష్ దర్శకత్వం వహించిన “మిస్టర్ లోకల్” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో కనిపించింది.కాగా ప్రస్తుతం అమ్మడు చేతిలో సినిమా అవకాశాలు పెద్దగా లేవు.దీంతో పాపులర్ కావాలని షాలు షమ్ము ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోందని కూడా మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube