గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీగన్నవరం అసెంబ్లీకి తాను రాజీనామా చేస్తానని తనపై పోటీకి లోకేష్ పోటీ చేయగలరా అంటూ ఇటీవల చాలెంజ్ చేశారు.అంతమాత్రమే కాకుండా ఖాళీ పేపర్ పై సంతకం చేసి మరీ తెలుగుదేశం పార్టీ నాయకులకు పంపించి తాను రాజీనామా చేయడానికి సిద్ధమని ఆ పేపర్ పై.
తానూ రాజీనామా చేస్తున్నట్లు రాసుకున .స్పీకర్ కి అందజేస్తే గన్నవరం లో పోటీకి సిద్ధమని సవాల్ విసిరారు.ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వల్లభనేని వంశీ ఈ వ్యవహారం పై తనదైన శైలిలో స్పందించారు.
వంశీ తన భాషతో కృష్ణాజిల్లాకు చెడ్డ పేరు తీసుకు వస్తున్నారని పేర్కొన్నరు.
తెలుగుదేశం పార్టీ సింబల్ పై గెలిచిన వంశీ ఇప్పుడు చంద్రబాబు అదే రీతిలో లోకేష్ లని విమర్శించడం దారుణం అని అన్నారు.వంశీ మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఆయన ఇంట్లో భార్య పిల్లలు కూడా సిగ్గుపడుతున్నారని స్పష్టం చేశారు.
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి డైరెక్షన్లోనే వంశీ మాట్లాడుతున్నారని.చెప్పుకొచ్చారు.మహిళలను కించపరిచే విధంగా వంశీ వ్యాఖ్యలు ఉన్నాయని వంశీ ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి అని కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో విమర్శలు వర్షం కురిపించారు.B
.