మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్ కొట్టివేత..!  

Ex minnister kollu ravindra, krishna district, bail petition dismissed, ycp leader bhaskar rao died - Telugu Bail Petition Dismissed, Ex Minnister Kollu Ravindra, Krishna District, Ycp Leader Bhaskar Rao Died

వైసీపీ నేత హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు కృష్ణా జిల్లా కోర్టు షాకిచ్చింది.కొల్లు రవీంద్ర దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.

 Kollu Ravindra Krishna District Bail Petition Dismissed

మచిలీపట్నానికి చెందిన వైసీపీ నేత మోకా భాస్కరావు హత్య కేసులో కొల్లు రవీంద్ర ఏ4 నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే.ఈ కేసులో బెయిల్ కోరుతూ కొల్లు రవీంద్ర కృష్ణా జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.కొల్లు రవీంద్ర బయటికి వస్తే ఈ కేసుకు సంబంధించిన అంశాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) వాదనతో జిల్లా కోర్టు ఏకీభవించింది.

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్ కొట్టివేత..-Latest News-Telugu Tollywood Photo Image

దీంతో కొల్లు రవీంద్రతో పాటు మిగతా నిందితులకు కూడా బెయిల్ ను నిరాకరించింది.

ఈ ఏడాది జూన్ 29న మచిలీపట్నం చేపల మార్కెట్ వద్ద వైసీపీ నేత మోకా భాస్కరరావు దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే.

ఈ కేసులో చింతా నాంచారయ్య (చిన్ని), చింతా నాంచారయ్య (పులి), చింతా నాగమల్లేశ్వరరావు, చింతా వంశీకృష్ణ, పోల రాము, ధనలతో పాటు ఓ మైనర్ ను అరెస్టు చేశారు.ఈ కేసులో కొల్లు రవీంద్రను కుట్రదారుడిగా పేర్కొంటూ ఏ-4 నిందితుడిగా అరెస్ట్ చేశారు.

కొల్లు రవీంద్ర నిందితులకు సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి.ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kollu Ravindra Krishna District Bail Petition Dismissed Related Telugu News,Photos/Pics,Images..