ఈ రోజు ఐపీఎల్ లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ తో సన్ రైజర్స్ ఢీ.. ఏ జట్టుకు గెలుస్తుందో తెలుసా?

ఈ రోజు ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడబోతుంది.రెండు జట్లు చూస్తే బలంగా కనిపిస్తుంది.

 Kolkata Knight Riders Vs Sunrisers Who Will Win-TeluguStop.com

కోల్ కతా అటు బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లోను పటిష్టంగా కనిపిస్తుంది.దినేష్ కార్తీక్ కెప్టెన్సీ లో కోల్ కతా బరిలోకి దిగనుంది.

ఇటు సన్ రైజర్స్ జట్టు కూడా డేవిడ్ వార్నర్ రాకతో గతేడాదితో పోలిస్తే మరింత బలంగా ఉంది.గాయం కారణంగా ఈ మ్యాచ్ కి విల్లియమ్సన్ దూరం అవుతున్నాడు.అయితే సన్ రైజర్స్ జట్టు పగ్గాలు ఎవరికి అప్పగిస్తారో వేచి చూడాలి .2016 లో డేవిడ్ వార్నర్ నాయకత్వం లో సన్ రైజర్స్ మొట్ట మొదటిసారిగా ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకుంది.

పిచ్ ఎలా ఉండబోతుంది

కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్ ఆడుతుండడం , ఇక్కడి పిచ్ బ్యాటింగ్ కి సహరిస్తుంది , పిచ్ పైన పచ్చిక తక్కువ ఉండి పగుళ్ల వల్ల మ్యాచ్ సాగుతూ ఉంటున్నకొద్ది పిచ్ లో టర్న్ పెరుగుతుంది.స్పిన్నర్లకి ఈ పిచ్ బాగా కలిసొస్తుందో.

ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య రికార్డులు

కోల్ కతా నైట్ రైడర్స్ , సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటివరకు 15 మ్యాచ్ లు ఆడగా కోల్ కతా దే పై చేయి ఉంది.కోల్ కతా 9 మ్యాచ్ లు గెలవగా సన్ రైజర్స్ 6 మ్యాచ్ లు గెలిచింది.

కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఎలా ఉండబోతుంది

దినేష్ కార్తీక్ సారథ్యం లో కోల్ కతా ఆడనుంది , ఈ జట్టు బలం బౌలింగ్ తో పాటు హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్ మెన్ ఉండటం.క్రిష్ లిన్ , శుభమన్ గిల్ , కార్తిక్ , ఉతప్ప , రస్సెల్ లాంటి టీ20 స్టార్స్ తో పాటు బౌలింగ్ లో నరైన్ , కుల్ దీప్ యాదవ్ , చావ్ల లాంటి బౌలింగ్ కె.కె.ఆర్ సొంతం
.

కోల్ కతా నైట్ రైడర్స్ PROBABLE XI – రాబిన్ ఉతప్ప , దినేష్ కార్తీక్ , నితీష్ రానా , శుభమ్ గిల్ , క్రిష్ లిన్ , ఆండ్రి రస్సెల్ , నరైన్ , కుల్ దీప్ యాదవ్ , పియూష్ చావ్లా , లోకి ఫగుసేన్ , ప్రసిద్ కృష్ణ

సన్ రైజర్స్ జట్టు ఎలా ఉండబోతుంది

గతేడాది జట్టు సమిష్టి కృషి తో పాటు విల్లియమ్సన్ అద్భుతమైన కెప్టెన్సీ లో ఫైనల్ వరకు దూసుకెళ్లింది సన్ రైజర్స్ .బౌలింగ్ సన్ రైజర్స్ కి బలం.ఈ మ్యాచ్ కి గాయం తో విల్లియమ్సన్ దూరం అవగా డేవిడ్ వార్నర్ రెండేళ్ల తరువాత సన్ రైజర్స్ కి ఆడనున్నాడు.రషీద్ ఖాన్ , భువనేశ్వర్ , షకిబ్ ఆల్ హసన్ లాంటి ప్రపంచ స్థాయి బౌలర్ లు రైజర్స్ సొంతం.

సన్ రైజర్స్ హైదరాబాద్ PROBABLE XI – డేవిడ్ వార్నర్ , శిఖర్ ధావన్ ,జానీ బైర్ స్టో , మనీష్ పాండే , సాహ , విజయ్ శంకర్ , షాకిబ్ ఆల్ హసన్ , యూసఫ్ పఠాన్ , రషీద్ ఖాన్ , భువనేశ్వర్ కుమార్ , సిద్దార్థ్ కౌల్

ఎవరు గెలిచే అవకాశం ఉంది

కోల్ కతా , హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ పోటాపోటీ గా ఉండడం ఖాయం , ఒకవేళ సన్ రైజర్స్ జట్టు ముందు బ్యాటింగ్ చేస్తే 170 పరుగుల పైగా చేస్తే సన్ రైజర్స్ జట్టుకు విజయావకాశాలు ఎక్కువ.బలమైన బౌలింగ్ తో ప్రత్యర్థులను కట్టడి చేయచ్చు.

ఒకవేళ నైట్ రైడర్స్ మొదటి బ్యాటింగ్ చేస్తే భారీ లక్ష్యం ఉంచితే హైదరాబాద్ కి కష్టమే.ఏది ఏమైనా ఇరు జట్లకి 50 50 అవకాశాలు ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube