ఈ రోజు ఐపీఎల్ లో కోల్ కత్తా తో బెంగళూర్ మ్యాచ్.. ఏ జట్టుకు గెలిచే అవకాశాలు ఉన్నాయో చూడండి..

ఐపీఎల్ లో ఇప్పటిదాకా ఆడిన 4 మ్యాచ్ లలో ఘోర పరాజయాలు పాలై పాయింట్ల పట్టికలో చివరి స్థానం లో ఉంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు.కోల్ కత్తా తో ఆడే మ్యాచ్ సొంత గ్రౌండ్ లో ఆడనుంది.

 Kolkata Knight Riders Vs Royal Challengers Bangalore Who Will Win-TeluguStop.com

దీనికి తోడు జట్టులో భారీ మార్పులతో బరిలోకి దిగనుంది.ఆ జట్టు లో చహల్ , పార్థివ్ పటేల్ మినహాయించి ఏ ఒక్కరు ఫామ్ లో లేరు.

ఇటు కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు అన్ని విభాగాల్లో బలంగా ఉంది.కోల్ కత్తా తన చివరి మ్యాచ్ ఢిల్లీతో ఆడగా ఆ మ్యాచ్ లో ఓటమి అంచు నుండి సూపర్ ఓవర్ వరకు తీసుకెళ్లింది.

ఆండ్రి రస్సెల్ భీకరమైన ఫామ్ లో ఉన్నాడు.చివరి మ్యాచ్ లో గాయం తో బాధపడిన రస్సెల్ ఈ మ్యాచ్ లో ఆడతాడో లేడో వేచి చూడాలి.

1)ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య రికార్డులు ఇలా ఉన్నాయి.

ఇరు జట్లు మొత్తం 23 మ్యాచ్ లో ఆడగా బెంగళూరు 9 మ్యాచ్ లో నెగ్గింది.కోల్ కత్తా 14 మ్యాచ్ ల్లో గెలుపొందింది.

2)పిచ్ ఎలా ఉండబోతుంది

బెంగళూర్ చిన్న స్వామి పిచ్ బ్యాటింగ్ కి అనుకూలిస్తుంది.మొదట బ్యాటింగ్ చేసే జట్టు సగటున 180 పరుగులు చేసింది.ఈ గ్రౌండ్ లో బౌండరీలు చిన్నవిగా ఉండడంతో పరుగుల వరద ఖాయం అనడం లో సందేహం లేదు.

3)కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు ఎలా ఉండబోతుంది

కోల్ కత్తా జట్టు తన చివరి మ్యాచ్ ఢిల్లీ తో టాప్ ఆర్డర్ విఫలమైన కార్తిక్ , రస్సెల్ సహాయం తో భారీ స్కోర్ చేయగలిగింది.ఒకరు విఫలం అయిన మరొకరు బాధ్యతాయుతంగా ఆడి జట్టు కి మంచి స్కోర్ ని అందిస్తున్నారు.ఈ మ్యాచ్ లో కోల్ కత్తా టాప్ ఆర్డర్ మొదటి పది ఓవర్ లలో వికెట్ లు కాపాడుకుంటే భారీ స్కోర్ చేయడం ఖాయం.జట్టులో పెద్దగా మార్పులేమి ఉండకపోవచ్చు.

కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు ( PROBABLE XI ) – రాబిన్ ఉతప్ప , నితీష్ రానా , దినేష్ కార్తీక్ , శుభమన్ గిల్ , క్రిష్ లిన్ , నిఖిల్ నాయక్ , ఆండ్రి రస్సెల్ , పీయూష్ చావ్లా , లోకి ఫెర్గ్సన్ ,కుల్దీప్ యాదవ్ , సునీల్ నరైన్

4)రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు ఎలా ఉండబోతుంది

వరుస ఓటములతో ఉన్న బెంగళూర్ ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యం తో బరిలోకి దిగనుంది.ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు కోహ్లీ , డివిలియర్స్ ఫామ్ జట్టుని మరింత ఒత్తిడిలోకి నెడుతుంది.వెస్టిండీస్ చిచ్చర పిడుగు షిమ్రాన్ హెట్ మేయర్ ఆడిన నాలుగు మ్యాచ్ లలో రెండెకల పరుగులు కూడా చేయలేకపోయాడు.ఈ మ్యాచ్ లో అతడి ని ఆడించకపోవచ్చు.

ఆర్సీబి జట్టు బౌలింగ్ కూడా ఫామ్ లేక ఇబ్బంది పడుతుంది , చహల్ మినహా ఎవరు రాణించడం లేదు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు ( PROBABLE XI ) – విరాట్ కోహ్లీ , పార్థివ్ పటేల్ , మెయిన్ అలీ , డివిలియర్స్ , మార్కస్ స్టయినిస్ , అక్షదీప్ నాథ్ , శివమ్ దుభే , చహల్ , ఉమేష్ యాదవ్ , సిరాజ్ , టీమ్ సౌతి

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube