ఈ రోజు ఐపీఎల్ లో కోల్ కత్తా తో బెంగళూరు మ్యాచ్... ఏ జట్టు కి గెలిచే అవకాశాలు ఉన్నాయో చూడండి...  

Kolkata Knight Riders Vs Royal Challengers Bangalore Who Will Win -

కోల్ కత్తా నైట్ రైడర్స్ బ్యాటింగ్ లో బలంగా ఉన్న వరుస వైఫల్యాల తో సతమతమవుతుంది.ఈ రోజు ఆ జట్టు బెంగళూర్ తో ఆడనుంది.

Kolkata Knight Riders Vs Royal Challengers Bangalore Who Will Win

ఇకపోతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు ఆడిన 8 మ్యాచ్ లలో ఒక్క మ్యాచ్ లో తప్ప అన్నిట్లో ఓటమి పాలయింది.ముంబై తో ఆడిన చివరి మ్యాచ్ లో గెలిచే అవకాశం ఉన్న డెత్ ఓవర్ బౌలింగ్ వల్ల విజయం సాధించలేకపోయింది.ఇక బెంగళూర్ జట్టు ప్లే ఆఫ్స్ బరిలో నుండి నిష్క్రమించినట్లే.

1)ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లలో రికార్డ్ లు ఎలా ఉన్నాయి

కోల్ కత్తా , బెంగళూర్ జట్లు ఇప్పటి వరకు 23 మ్యాచ్ లలో ఆడగా కోల్ కత్తా 14 మ్యాచ్ లలో విజయం సాధించగా , బెంగళూర్ జట్టు 9 మ్యాచ్ లలో విజయం సాధించింది.

ఈ రోజు ఐపీఎల్ లో కోల్ కత్తా తో బెంగళూరు మ్యాచ్… ఏ జట్టు కి గెలిచే అవకాశాలు ఉన్నాయో చూడండి…-Sports News క్రీడలు-Telugu Tollywood Photo Image

2)పిచ్ ఎలా ఉండబోతుంది

ఈ మ్యాచ్ కోల్ కత్తా లోని ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది.ఇక్కడ పిచ్ బ్యాటింగ్ కి అనుకూలించనుంది.టాస్ గెలిచిన జట్టు లక్ష్యాన్ని ఛేదించడానికి ఇష్టపడుతుంది

3)కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు ఎలా ఉండబోతుంది

కోల్ కత్తా జట్టు ఈ సీజన్ లో బలమైన జట్లలో ఒకటి సీజన్ మొదట్లో రస్సెల్ పుణ్యమా అని వరుసగా మ్యాచ్ లు గెలుచుకుంటు వచ్చింది.కానీ ఈ మధ్య ఆ జట్టు బ్యాట్స్ మెన్ ఫామ్ లో లేక జట్టు భారీగా స్కోర్ చేయలేకపోతుంది.ఇకపోతే బౌలింగ్ లో కూడా జట్టు ది అదే పరిస్థితి ఉంది డెత్ ఓవర్ లలో పరుగులు సమర్పించుకుంటున్నారు.రాబిన్ ఉతప్ప , నితీష్ రానా , దినేష్ కార్తిక్ లు ఫామ్ లోకి రావాల్సి ఉంది.

కోల్ కత్తా భారీ స్కోర్ చేయగలిగితే విజయావకాశాలు ఆ జట్టుకు ఉంటాయి.

కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు ( PROBABLE XI ) – క్రిస్ లిన్ , రాబిన్ ఉతప్ప , నితీష్ రానా , దినేష్ కార్తీక్ , శుభమన్ గిల్ , ఆండ్రి రస్సెల్ , సునీల్ నరైన్ , పీయూష్ చావ్లా , ప్రసీద్ కృష్ణ , కుల్దీప్ యాదవ్ , హరీ గెర్నీ

4)రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు ఎలా ఉండబోతుంది

బెంగళూర్ జట్టు ప్రధాన సమస్య బౌలింగ్ అని చెప్పొచ్చు , బ్యాట్స్ మెన్ భారీగా పరుగులు చేసి మంచి లక్ష్యాన్ని ఉంచిన బౌలర్లు తమ చెత్త బౌలింగ్ తో మ్యాచ్ ని ఓటమి వైపు నడిపిస్తున్నారు.గత మ్యాచ్ లో 19 ఓవర్ లో ఏకంగా 24 పరుగులు ఇచ్చాడు పవన్ నేగి.డెత్ ఓవర్ లలో సిరాజ్ , ఉమేష్ లు ఒక్క మ్యాచ్ లో కూడా తమ నుండి అత్యుత్తమ ప్రదర్శన చూపించలేదు.

ఈ మ్యాచ్ లో బౌలర్లు రాణిస్తే తప్ప ఆ జట్టు గెలిచే అవకాశం లేదు.బ్యాటింగ్ లో ఎక్కువగా డివిలియర్స్ , కోహ్లీ పైనే ఆధారపడుతుంది.ఇప్పటి కి ప్లే ఆఫ్స్ ఆశలు కోల్పోయిన ఆ జట్టు కోల్ కత్తా తో ఎలా అడుతుందో వేచి చూడాలి.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు ( PROBABLE XI ) – పార్థివ్ పటేల్ , విరాట్ కోహ్లీ , డివిలియర్స్ , మార్కస్ స్టయిన్స్ , మెయిన్ అలీ , అక్షదీప్ నాథ్ , పవన్ నేగి , చహల్ , ఉమేష్ యాదవ్ , డెల్ స్టెయిన్ , నవదీప్ సైని

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kolkata Knight Riders Vs Royal Challengers Bangalore Who Will Win- Related Telugu News,Photos/Pics,Images..