ఈ రోజు ఐపీఎల్ లో రాజస్థాన్ తో కోల్ కత్తా మ్యాచ్ ... ఏ జట్టుకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో చూడండి..

సీజన్ కి ఆరంభలో వరుస విజయాలతో దూసుకుపోయిన కోల్ కత్తా ప్రస్తుతం ప్లే ఆఫ్స్ కి వెళ్లడం కూడా కష్టమైపోయింది.ఆ జట్టు ఎక్కువగా ఒకరు లేదా ఇద్దరి ఆటగాళ్ళ పైన ఆధారపడటం కూడా ఈ సీజన్ లో వరుస ఓటముల కి కారణం.

 Kolkata Knight Riders Vs Rajasthan Royals Match Prediction-TeluguStop.com

కోల్ కత్తా జట్టు బౌలింగ్ లో కూడా చాలా బలహీనంగా ఉండటం మరొక కారణం.దినేష్ కార్తీక్ ఒక్క మ్యాచ్ లో తప్ప దాదాపు ఈ సీజన్ అంత వరుసగా విఫలమయ్యాడు.

ఇకపోతే ఇప్పటికి ప్లే ఆఫ్స్ రేసు నుండి తప్పుకున్న రాజస్థాన్ జట్టు ఇటువంటి కీలక మ్యాచ్ లలో గెలిచి ఇతర జట్ల అవకాశాలను సంక్లిష్టం చేయాలని భావిస్తోంది.చాలా మ్యాచ్ ల తరువాత ఫామ్ లోకి వచ్చి ఢిల్లీ పైన సెంచరీ చేసిన రహానే ఈ మ్యాచ్ లో కూడా రాణిస్తే రాజస్థాన్ భారీగా స్కోర్ చేయగలదు.

బౌలింగ్ లో రాజస్థాన్ కూడా బలహీనంగానే కనిపిస్తుంది.ఆ జట్టు కి మంచి అనుభవం గల పేసర్ లేకపోవడంతో కీలకమైన డెత్ ఓవర్ లలో ధారాళంగా పరుగులు ఇస్తుంది.

1)ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లలో రికార్డ్ లు ఎలా ఉన్నాయి

ఇప్పటి వరకు రాజస్థాన్ , కోల్ కత్తా జట్ల మధ్య 20 మ్యాచ్ లు జరగగా రాజస్థాన్ 9 మ్యాచ్ లలో గెలుపొందింది.కోల్ కత్తా 10 మ్యాచ్ లలో విజయం సాధించింది.ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు.

2)పిచ్ ఎలా ఉండబోతుంది

ఈ మ్యాచ్ కోల్ కత్తా లో జరగనుంది.ఇక్కడి పిచ్ బ్యాటింగ్ కి అనుకూలంగా ఉండబోతుంది.మొదట బ్యాటింగ్ చేసే జట్టు 170 పైగా పరుగులు చేసే అవకాశం ఉంది.

3)రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎలా ఉండబోతుంది

ఢిల్లీ తో మ్యాచ్ లో రాజస్థాన్ 190 పైగా పరుగులు చేసినప్పటికీ మ్యాచ్ ఓటమి పాలయింది.దీనికి ముఖ్య కారణం చివరి ఓవర్లలో పస లేని బౌలింగ్ వేయడం.

ఆ జట్టు బ్యాట్స్ మెన్ లు మరోసారి రాణిస్తే రాజస్థాన్ గెలిచే అవకాశాలు ఉంటాయి.ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ లు రాణించాల్సి ఉంది.బెన్ స్టోక్స్ , సంజు శాంసన్ నుండి మంచి ఇన్నింగ్స్ లు వచ్చి చాలా మ్యాచ్ లు అయిపోయాయి.జాస్ బట్లర్ స్వదేశానికి వెళ్లిపోవడం తో జట్టు బ్యాటింగ్ బాధ్యత రహానే , స్మిత్ ల పై పడనుంది.

రాజస్థాన్ రాయల్స్ జట్టు ( PROBABLE XI ) – అజింక్య రహానే , సంజు శాంసన్ , స్టీవ్ స్మిత్ , బెన్ స్టోక్స్ , లియమ్ లివింగ్స్టన్ , స్టువర్ట్ బిన్నీ , రియన్ పరగ్ , శ్రేయస్ గోపాల్ , జోఫ్రా ఆర్చర్ , జయదేవ్ ఉనత్కట్ , ధవాల్ కులకర్ణి

4)కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు ఎలా ఉండబోతుంది

కోల్ కత్తా జట్టు ప్లే ఆఫ్స్ ఆశలను నిలబెట్టుకోవాలంటే ఈ మ్యాచ్ వారికి ఎంతో కీలకం , మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ లో ఉండడం కోల్ కత్తా జట్టు కి కలిసొచ్చే అవకాశం ఉంది.నైట్ రైడర్స్ జట్టు కి లిన్ , నరైన్ రూపం లో పవర్ ప్లే లలో మంచి ఆరంభాలు వస్తున్న దానిని ఆ జట్టు భారీ స్కోర్ లుగా చేయలేకపోతుంది.

ఇకపోతే రాబిన్ ఉతప్ప , దినేష్ కార్తిక్ లాంటి సీనియర్లు తరుచు వైఫల్యాలు ఆ జట్టు బ్యాటింగ్ ని కొంత బలహీన పరుస్తుంది.రస్సెల్ మరొకసారి తన బ్యాట్ తో భారీగా పరుగులు చేయగలిగితే రాజస్థాన్ పై గెలిచే అవకాశాలు కోల్ కత్తా కి ఉంటాయి.

కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు ( PROBABLE XI ) – క్రిస్ లిన్ , సునీల్ నరైన్ , రాబిన్ ఉతప్ప , నితీష్ రానా , దినేష్ కార్తిక్ , శుభమన్ గిల్ , ఆండ్రి రస్సెల్ , కుల్దీప్ యాదవ్ , ప్రసీద్ కృష్ణ , పీయూష్ చావ్లా , హరీ గెర్నీ

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube