ఈ రోజు ఐపీఎల్ లో ఢిల్లీ తో కోల్ కత్తా మ్యాచ్.. ఏ జట్టుకి ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయో  

Kolkata Knight Riders Vs Delhi Capitals Match Predction-ipl 12 Sessions,ipl Match Prediction,kolkata Knight Riders,today Ipl Matc,ఐపీఎల్,కోల్ కత్తా నైట్ రైడర్స్,ఢిల్లీ క్యాపిటల్స్

వరుస విజయాలతో జోరు మీద ఉన్న కోల్ కత్తా కి గత మ్యాచ్ లో చెన్నై బ్రేక్ వేసింది. ఆ జట్టు ఎక్కువగా బ్యాటింగ్ పైనే ఆధారపడి ఉంది. అటువంటి బలమైన బ్యాటింగ్ కలిగిన జట్టు చెన్నై మ్యాచ్ లో కనీసం 120 పరుగులు కూడా చేయలేకపోయింది. ఒక రస్సెల్ మినహా ఏ బ్యాట్స్ మెన్ కూడా క్రీజులో నిలదొక్కుకోలేదు..

ఈ రోజు ఐపీఎల్ లో ఢిల్లీ తో కోల్ కత్తా మ్యాచ్.. ఏ జట్టుకి ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయో-Kolkata Knight Riders Vs Delhi Capitals Match Predction

నైట్ రైడర్స్ జట్టు బౌలింగ్ లో పర్వలేదనిపించిన బ్యాటింగ్ లో ఎక్కువగా రస్సెల్ పైనే ఆధారపడాల్సి వస్తుంది. ఇకపోతే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తన గత మ్యాచ్ లో బెంగళూర్ పైన అన్ని భాగాల్లో రాణించి మంచి విజయాన్ని దక్కిచుకుంది. ఆ జట్టు ఓపెనర్లు ధావన్ , ప్రిథ్వీ షా లు పేలవ ఫామ్ లో ఉన్నారు.

బౌలింగ్ లో రబడ , మిశ్రా , బౌల్ట్ లు రాణిస్తున్నారు.

1)ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ల రికార్డ్ లు ఎలా ఉన్నాయి

ఇరు జట్లు ఇప్పటి వరకు 24 మ్యాచ్ లు ఆడగా కోల్ కత్తా 14 మ్యాచ్ లలో గెలవగా , ఢిల్లీ 9 మ్యాచ్ ల్లో గెలిచింది. ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు.

2)పిచ్ ఎలా ఉండబోతుంది

నైట్ రైడర్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ కోల్ కత్తా లోని ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది. ఇక్కడి పిచ్ బ్యాటింగ్ కి అనుకూలించనుంది.

టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంటుంది. లక్ష్య చేదనలో ఇక్కడ ఆడిన జట్లు ఎక్కువగా విజయాలు సాధించింది.

3)ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఎలా ఉండబోతుంది

ఢిల్లీ జట్టు బౌలింగ్ లో రబడ , ఇషాంత్ శర్మ , మోరిస్ , అమిత్ మిశ్రా లతో బలంగా ఉంది. బ్యాటింగ్ లో బ్యాట్స్ మెన్ నిలకడ లేక ఆ జట్టు ఇబ్బంది పడుతుంది.

ముఖ్యంగా సీనియర్ స్టార్ ప్లేయర్ శిఖర్ ధావన్ ఫామ్ లో లేకపోవడం ఆ జట్టు బ్యాటింగ్ ని పెద్ద సమస్యగా మారుస్తుంది. ఇకపోతే యువ ఆటగాళ్లలో ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మినహా మిగతా ప్లేయర్ లు భారీ ఇన్నింగ్స్ లు ఆడలేకపోతున్నారు.ఢిల్లీ బ్యాట్స్ మెన్ లు సమిష్టిగా రాణిస్తే ఆ జట్టు కి గెలిచే అవకాశాలు ఉన్నాయి.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ( PROBABLE XI ) – శిఖర్ ధావన్ , ప్రిథ్వీ షా , శ్రేయస్ అయ్యర్ , రిషబ్ పంత్ , కలిన్ ఇంగ్రామ్ , హనుమ విహారి , క్రిస్ మోరీస్ , రబడ , అమిత్ మిశ్రా , ట్రెంట్ బౌల్ట్ , రాహుల్ తేవాటియా

4)కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు ఎలా ఉండబోతుంది

కోల్ కత్తా జట్టు జోరుకి గత మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ కళ్లెం వేసింది. ఆ జట్టు టాప్ ఆర్డర్ తో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ చెన్నై బౌలర్లకు తలవంచారు. ఆ జట్టు ఎక్కువగా ఆండ్రి రస్సెల్ పైనే ఆదారపడుతుంది. ఢిల్లీ తో జరిగే మ్యాచ్ లో నైట్ రైడర్స్ జట్టు టాప్ ఆర్డర్ రాణిస్తే భారీ పరుగులు చేసే అవకాశం ఉంది.

ఇకపోతే బౌలింగ్ లో లోకి ఫెర్గ్ సేన్ , కూల్ దీప్ యాదవ్ , నరైన్ లతో బలంగా కనిపిస్తుంది.

కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు (PROBABLE XI ) – రాబిన్ ఉతప్ప , సునీల్ నరైన్ , క్రిస్ లిన్ , నితీష్ రానా , దినేష్ కార్తిక్ , శుభమన్ గిల్ , ఆండ్రి రస్సెల్ , లోకి ఫెర్గ్ సేన్ ,కూల్ దీప్ యాదవ్ , పీయూష్ చావ్ల , ప్రసీద్ క్రిష్ణ