ఈ రోజు ఐపీఎల్ లో కోల్ కత్తా తో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్.. ఏ జట్టుకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో చూడండి...  

Kolkata Knight Riders Vs Chennai Super Kings Match Prediction-ipl 12th Session,ipl Match Prediction,kolkata Knight Riders,ఐపీఎల్,కోల్ కత్తా నైట్ రైడర్స్,చెన్నై సూపర్ కింగ్స్

 • ఈ సీజన్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ కి చెన్నై సూపర్ కింగ్స్ కి మధ్య 2 వ మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లు ముందు ఆడిన మ్యాచ్ లో చెన్నై జట్టు గెలిచింది. చెన్నై బౌలర్ల ముందు కోల్ కత్తా బౌలర్లు నిలవలేకపోయారు.

 • ఈ రోజు ఐపీఎల్ లో కోల్ కత్తా తో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్.. ఏ జట్టుకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో చూడండి...-Kolkata Knight Riders Vs Chennai Super Kings Match Prediction

 • అయితే ఈ మ్యాచ్ కోల్ కత్తా లోని ఈడెన్ గార్డెన్స్ లో జరగనుండడం కోల్ కత్తా కి కలిసి వస్తుందని ఆ జట్టు ఆశ. ఇప్పటికి వరుసగా రెండు ఓటములతో ఉన్న కోల్ కత్తా జట్టు ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని లక్ష్యంగా బరిలోకి దిగనుంది.

 • ఇకపోతే చెన్నై జట్టు వరుస విజయాలతో ఊపు మీద ఉంది , ఇప్పటికే 6 విజయాలతో పాయింట్ ల పట్టికలో అగ్రస్థానం లో ఉన్న చెన్నై జట్టు ఈ మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్స్ కి మరింత చేరువ అవ్వాలనుకుంటుంది.

  1)ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య రికార్డులు ఎలా ఉన్నాయి

  ఇరు జట్లు ఇప్పటి వరకు మొత్తం 22 మ్యాచ్ లు ఆడగా చెన్నై 13 మ్యాచ్ లలో గెలుపొందింది , నైట్ రైడర్స్ జట్టు 8 మ్యాచ్ లలో గెలవగా ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు.

  Kolkata Knight Riders Vs Chennai Super Kings Match Prediction-Ipl 12th Session Ipl Prediction Kolkata ఐపీఎల్ కోల్ కత్తా నైట్ రైడర్స్ చెన్నై సూపర్ కింగ్స్

  2)పిచ్ ఎలా ఉండబోతుంది

  చెన్నై తో కోల్ కత్తా మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది. ఇక్కడ పిచ్ బ్యాట్స్ మెన్ కి అనుకూలంగా ఉండనుంది. తొలుత బ్యాటింగ్ చేసే జట్టు వికెట్లు కాపాడుకొని ఆడగలితే భారీ స్కోర్ లు చేయవచ్చు.

 • 3)కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు ఎలా ఉండబోతుంది

  Kolkata Knight Riders Vs Chennai Super Kings Match Prediction-Ipl 12th Session Ipl Prediction Kolkata ఐపీఎల్ కోల్ కత్తా నైట్ రైడర్స్ చెన్నై సూపర్ కింగ్స్

  కోల్ కత్తా జట్టు తమ గత మ్యాచ్ లో ఢిల్లీ పైన ఓటమి పాలైంది , ఆ జట్టు ఎక్కువగా రస్సెల్ పైనే ఆధారపడి ఉండడం ఆ జట్టుని మరింత ఒత్తిడికి గురై చేస్తుంది. ఆ జట్టు కెప్టెన్ దినేష్ కార్తిక్ కూడా చెప్పుకోదగ్గ పరుగులు చేయట్లేదు. ఇకపోతే ఓపెనర్ గా ఆడిన శుభమన్ గిల్ తన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు.

 • కోల్ కత్తా టాప్ ఆర్డర్ రాణిస్తే ఆ జట్టు భారీ పరుగులు చేయగలుగుతుంది.

  కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టు ( PROBABLE XI ) – రాబిన్ ఉతప్ప , నితీష్ రానా , దినేష్ కార్తిక్ , శుభమన్ గిల్ , క్రిస్ లిన్ , ఆండ్రి రస్సెల్ , సునీల్ నరైన్ ,హరీ గర్నీ , పీయూష్ చావ్లా , ప్రశిద్ కృష్ణ , కూల్ దీప్ యాదవ్

  4)చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎలా ఉండబోతుంది

  Kolkata Knight Riders Vs Chennai Super Kings Match Prediction-Ipl 12th Session Ipl Prediction Kolkata ఐపీఎల్ కోల్ కత్తా నైట్ రైడర్స్ చెన్నై సూపర్ కింగ్స్

  చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తమ గత మ్యాచ్ లో చివరి బంతి వరకు పోరాడి గెలిచింది. ఈ మ్యాచ్ లో కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి లక్ష్యాన్ని ఛేదించాలి అనుకుంటుంది.

 • ఆ జట్టు ఆటగాళ్లు ధోని , రాయుడు ఫామ్ లోకి రావడం ఆ జట్టు బ్యాటింగ్ ని బలంగా మార్చింది. గత మ్యాచ్ లో టాప్ ఆర్డర్ విఫలమయినప్పటికి ధోని , రాయుడు భాగస్వామ్యం తో ఆ జట్టు గెలిచింది.

 • ఈ మ్యాచ్ లో కూడా బౌలర్లు రాణిస్తే ఆ జట్టు విజయం మరింత తేలిక అవుతుంది.

  చెన్నై సూపర్ కింగ్స్ జట్టు (PROBABLE XI ) – డూప్లెసిస్ , వాట్సన్ , రైనా , అంబటి రాయుడు , ధోని , జడేజా , కేదార్ జాధవ్ , హర్భజన్ సింగ్ , తహిర్ , దీపక్ చహార్ , కుగ్లెన్