హిట్ మ్యాన్ దెబ్బకు తోక ముడిచిన కేకేఆర్…!  

Mumbai Indians Won Match on Kolkata Knight Riders by 49 runs, Kolkata Knight Riders ,Mumbai Indians, Rohit Sharma, KKR Vs MI Highlights - Telugu Ipl, Ipl2020, Kkr, Kkr Vs Mi Highlights, Kolkata Knight Riders, Mumbai Indians, Mumbai Indians Won Match On Kolkata Knight Riders By 49 Runs, Rohit Sharma

ఐపీఎల్ 2020 సీజన్ సందర్భంగా జరిగిన 5వ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తో కోల్కతా నైట్ రైడర్స్ తలపడింది.ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తన కెప్టెన్ ఇన్నింగ్స్ తో ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ కు తొలి విజయాన్ని అందించాడు.

TeluguStop.com - Kolkata Knight Riders Mumbai Indians Ipl2020 Highlights

ముంబై ఇండియన్స్ 49 పరుగుల తేడాతో కోల్కత నైట్ రైడర్స్ పై విజయాన్ని అందుకుంది.మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ టీం 20 ఓవర్లు ముగిసే సమయానికి ఐదు వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది.

ముంబై ఇండియన్స్ టీం లో రోహిత్ శర్మ తన కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి ముంబై ఇండియన్స్ గెలవడంలో కీలక పాత్ర వహించాడు.రోహిత్ శర్మ 54 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లు సహాయంతో 80 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

TeluguStop.com - హిట్ మ్యాన్ దెబ్బకు తోక ముడిచిన కేకేఆర్…-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇక రోహిత్ శర్మ తో పాటుగా సూర్యకుమార్ యాదవ్ జత కలిసాడు.సురేష్ కుమార్ యాదవ్ 47 పరుగులు, సౌరబ్ తివారి 21 పరుగులు, హార్థిక్ పాండ్య 18 పరుగులు, పొలార్డ్ 13 పరుగులు చేయగలిగారు.

ఇక కోల్కత్తా నైట్ రైడర్స్ బౌలింగ్ విషయానికి వస్తే.శివం మావి రెండు వికెట్లు తీసుకోగా.సునీల్ నరైన్, ఆండ్రీ రసూల్ చెరో వికెట్ తీశారు.ఇక ఆ తర్వాత భారీ లక్ష్య ఛేదన కోసం దిగిన కేకేఆర్ మొదటి నుండే క్రమక్రమంగా వికెట్లను కోల్పోతూ కష్టాల్లో పడిపోయింది.

కలకత్తా నైట్ రైడర్స్ లో కమ్మిన్స్ అత్యధికంగా 33 పరుగులు సాధించగా, దినేష్ కార్తీక్ 30 పరుగులు, నితీష్ రానా 24 పరుగులు చేశారు.మిగితావారు పెద్దగా చెప్పుకొనే పరుగులు చేయలేకపోయారు.

ఇక చివరికి 20 ఓవర్లు ముగిసే సమయానికి 9 వికెట్లను కోల్పోయి కేవలం 146 పరుగులు మాత్రమే చేయగలిగింది.దీంతో ముంబై ఇండియన్స్ జట్టు 49 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది.

ఇక ఈ మ్యాచ్ తో ఓటమి పాలైన కేకేఆర్ తన రికార్డును సవరించుకునినట్లయింది.ఇక కేకేఆర్ బౌలర్ శివమ్ మావి ఈ సీజన్ లో మొదటి మేడిన్ ఓవర్ ని నమోదు చేశాడు.

మరోవైపు రోహిత్ శర్మ ఐపీఎల్ లో 200 ల సిక్సర్ల క్లబ్ లో చేరాడు.

#Mumbai Indians #Rohit Sharma #IPL2020 #KKRVs #MumbaiIndians

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kolkata Knight Riders Mumbai Indians Ipl2020 Highlights Related Telugu News,Photos/Pics,Images..