నువ్వు నిజంగా దేవుడు సామి... వేసవి నేపథ్యంలో ఆటోవాలా వింత ప్రయోగం

పుర్రెకో బుద్ది అంటారు పెద్దలు.అంటే ఒక విషయంలో ఒక్కో వ్యక్తి ఒక్కో రకంగా ఆలోచిస్తాడు.

 Kolkata Auto Wala Sets Up Garden On The Roof Of His Vehicle-TeluguStop.com

ఏ నలుగురు కూడా ఒకేలా ఆలోచించలేరు.ప్రస్తుతం ఎండాకాలం నడుస్తోంది.

జనాలు ఎండలను తప్పించుకునేందుకు నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే కోల్‌కతాకు చెందిన ఆటో డ్రైవర్‌ మాత్రం తన ఆటోను చల్లగా ఉంచేందుకు కొత్తగా ఆలోచించాడు.

అతడి ఆలోచనకు రోడ్డు మీద వెళ్లే వారు అంతా కూడా వావ్‌ అనాల్సిందే.అతడు చేసిన ప్రయత్నం అద్బుతం అంటూ జనాలు కొనియాడుతున్నారు.

ఇంతకు అతడు ఏం చేశాడో తెలుసా.తన ఆటోపై రేకుతో ఒక టబ్‌లా అమర్చి దాంట్లో మట్టి పోసి ఆ మట్టిలో చెట్లను నాటాడు.అది కూడా చిన్న చిన్న చెట్లు ఏమీ కావు.చల్లదనం ఇచ్చే చెట్లను అతడు నాటాడు.

వేసవి కాలంలోనే కాకుండా ఎప్పుడు కూడా తన ఆటోపై ఆ చెట్లు ఉంటాయని అంటున్నాడు.ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా నా ఆటో ఎక్కాలి, నా ఆటో ఎక్కిన వారిని సరికొత్త అనుభూతి కలగాలనే ఉద్దేశ్యంతో తాను ఇలాంటి ప్రయత్నం చేసినట్లుగా ఈ సందర్బంగా ఆయన చెప్పుకొచ్చాడు.

ఆటోపై బుల్లి గార్డెన్‌ను ఏర్పాటు చేసిన ఈ ఆటోవాలా పేరు బిజయ్‌ పాల్‌, ఈయన చాలా ఏళ్లుగా ఆటోను నడుపుతున్నాడు.తన సొంత ఆటోను చాలా ప్రత్యేకంగా తయారు చేయాలని, అందరి ఆటోలకు భిన్నంగా తన ఆటో ఉండాలనే ఉద్దేశ్యంతో ఇలా ఆటోపై గార్డెన్‌ను ఏర్పాటు చేయడం జరిగింది.అయితే బిజయ్‌ పాల్‌ చేసిన పనికి కొందరు ట్రాఫిక్‌ పోలీసులు ఇబ్బంది పెడుతున్నారట.అటోపై ఇలా ఏంటీ అంటూ కొందరు తిట్టడం మరి కొందరు వెంటనే తొలగించాలని హెచ్చరించడం చేస్తున్నారట.

అయినా కూడా బిజయ్‌ పాల్‌ మాత్రం తన ఆటోపై మినీ గార్డెన్‌ను తొలగించేందుకు సిద్దంగా లేడు.తనకు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చి పెట్టిన ఆటోను మరింత హంగులతో తీర్చి దిద్దుతాను అంటూ పాల్‌ చెబుతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube