వైసీపీలో మొదలైన లొల్లి...!!!

ఏపీ సీఎం న్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి పాలన ఇవ్వాలని, అవినీతి రహిత పాలన దిశగా వైసిపి ఉండాలని, ప్రజాప్రతినిధులందరూ ఒకే తాటిపై ఉంటూ ప్రజలకు సేవ చేయాలని ఆదేశాలు మొదటి రోజునే ఇచ్చారు, ఆ ఆశయంతోనే జగన్ ముందుకు వెళ్తున్నారు.ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఏ కార్యక్రమం అయినా సరే ప్రజా ఆమోదయోగ్యంగానే ఉండటంతో జగన్ పరిపాలనపై ఏపీ ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 Kolagatla Vs Botsa Satyanarayana Eligations In Ysrcp-TeluguStop.com

అయితే విజయనగరం జిల్లా ప్రజలు , వైసిపి కార్యకర్తలు మాత్రం అసంతృప్తిగా అన్నట్లుగా తెలుస్తోంది.విజయనగరం వైసీపీలో నెలకొన్న ఆధిపత్య ధోరణులు కీచులాటలే, అందుకు ప్రధాన కారణం అనేది ఆరోపణ.

-Telugu Political News

విజయనగరం జిల్లాలో అన్ని స్థానాల్లో విజయ దుందుభి మోగించిన వైసిపి టిడిపిని కోలుకోలేని దెబ్బ కొట్టింది.ఈ జిల్లా నుంచి గెలుపొందిన చీపురుపల్లి ఎమ్మెల్యే, మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లా పై ఆధిపత్యం కోసం పాకులాడుతున్నారని, ఈ క్రమంలోనే జిల్లా వైసీపీలో తీవ్ర విభేదాలు కలుగుతున్నాయని, అందుకు కారణం బొత్స ఆధిపత్య ధోరణి అని టాక్ వినిపిస్తోంది.వాస్తవానికి జిల్లాలో మరొక బలమైన నేత కోలగట్ల వీరభద్రస్వామి కూడా ఉన్నారు.వైసీపీ అధికారంలోకి రావడానికి జిల్లాలో ఆయన తీవ్రస్థాయిలోనే కృషి చేశారు.ఈ విషయం సీయం జగన్ కి కూడా తెలుసు.

మొదట్లో జగన్ వైశ్య సామాజికవర్గం నుంచి కోలగట్లకి మంత్రిగా అవకాశం ఇవ్వాలని ఆలోచన చేశారు అయితే కోలగట్ల కు మంత్రి పదవి ఇస్తే జిల్లా పై పట్టు పోతుందని భావించిన బొత్స, ఆయనకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడ్డారని ఆరోపణ కూడా వినిపిస్తోంది.

దాంతో ఇద్దరు కీలక నేతల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయని తెలుస్తోంది.ఈ జిల్లాలో ఏం జరిగినా సరే తనకు తెలియాలని అధికారులకు నేతలకు మంత్రి బొత్స ఆదేశాలు జారీ చేస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారట.

ఇదిలా ఉంటే వైసిపి కోసం కానీ ఎంతో కష్టపడ్డానని తన నియోజకవర్గంలో ఎవరు వేలు పెట్టినా సరే ఉపేక్షించేది లేదని కోలగట్ల నేరుగా హెచ్చరిస్తున్నారట.

-Telugu Political News

ఇదే సమయంలో తాను మున్సిపల్ శాఖ మంత్రిని గనుక జిల్లాలో ఏ పని జరిగిన తనకు తెలిసే జరగాలని బొత్స అనధికారిక ఆదేశాలు జారీ చేస్తున్నారట దాంతో ఇరువురు నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకోవడంతో స్థానికంగా ఉన్న వైసీపీ నేతలు ఇబ్బందులు పడుతున్నారని, జగనే ఆశయాలతో అయితే పాలన అందించారని అనుకుంటున్నారో అందుకు విరుద్ధంగా విజయనగరం జిల్లాలో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, జగన్ వీటికి చెక్ పెట్టకపోతే ప్రతిపక్షానికి వేలెత్తి చూపించే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు.మరి ఈ పరిణామాల నేపధ్యంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube