కోహ్లీకి మ‌ళ్లీ ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్య‌త‌లు.. ఒప్పిస్తానంటున్న ప్రాంచైజీ చైర్మ‌న్‌

ఆయ‌నో ప‌రుగుల యంత్రం.ఎలాంటి ఒత్తిడిని అయినా త‌ట్టుకుని జ‌ట్టును విజ‌య తీరాల‌కు చేర్చ‌గ‌ల దిట్ట‌.

 Kohli To Be Re-appointed Rcb Captaincy Details, Kohli, Cricket, Royal Challenger-TeluguStop.com

ఎంత పెద్ద ల‌క్ష్యం అయినా స‌రే ఒంటి చేత్తో చేధించ‌గ‌ల స‌త్తా ఉన్న ఛేద‌న రారాజు.ఆయ‌నే క్రికెట్ కింగ్ కోహ్లీ.

టీమ్ ఇండియాకు మొన్న‌టి దాకా మూడు ఫార్మాట్ల‌లో కెప్టెన్ గా ఉండి ఎన్నో అవార్డులు, విజ‌యాలు అందుకున్నాడు.జ‌ట్టును ఉన్నత స్థాయికి తీసుకెళ్లాడు.కాగా అత‌ని కెప్టెన్సీలో ఐపీఎల్ లో ఆర్సీబీ జ‌ట్టు కూడా బాగానే ఆడుతోంది.2013 నుంచి 2021 దాకా కోహ్లీనే ఆ జ‌ట్టును అన్ని విధాలుగా న‌డిపిస్తూ వ‌చ్చాడు.

దుర‌దృష్ట వ‌శాత్తు ఒక్క సారి కూడా టైటిల్ నెగ్గ‌లేక‌పోయాడు.దీంతో పోయినేడాది కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేశాడు.ఇక అప్ప‌టి నుంచి ఇదే ప్రాంచైజీలో సాధార‌ణ ఆట‌గాడిగా కొన‌సాగుతున్నాడు.గ‌త ఏడాది రూ.15 కోట్లతో కోహ్లీని కొన‌సాగించింది ఆర్సీబీ.ఇక అత‌నితో పాటు మాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్ ల‌ను అంటి పెట్టుకుంది ఈ ప్రాంచైజీ.

ఈ సారి కూడా వీరి ముగ్గురితో పాటు కొత్త వారిని తీసుకోవాల‌ని అనుకుంటుంది.ఇక వ‌చ్చే నెల‌ల‌లోనే మెగా వేలం స్టార్ట్ కానుంది.కాబ‌ట్టి కొత్త వారిని తీసుకుని వారిని కెప్టెన్సీ ప‌గ్గాలు ఇవ్వాలి.

Telugu Virat Kohli, Cricket, Kohli, Rcb, Rcb Chairman-Latest News - Telugu

అయితే కోహ్లీ కంటే అనుభ‌వ‌జ్ఞుడు మాత్రం ఆర్సీబీకి దొర‌క‌ట్లేదు.ఇప్ప‌టికే కొత్త‌గా రెండు ప్రాంచైజీలు రావ‌డంతో అనుభవం ఉన్న‌వారు ఆ టీమ్‌ల‌కు కెప్టెన్ లుగా మారిపోయారు.ఇక విదేశీ క్రికెట‌ర్‌కు ఇస్తే ఆద‌ర‌ణ త‌గ్గుతుంది.

స్వ‌దేశ‌స్థుడు అంటే శ్రేయాస్ అయ్యర్ త‌ప్ప ఎవ‌రూ లేరు.కాబ‌ట్టి తిరిగి విరాట్‌కే ప‌గ్గాలు ఇవ్వాల‌ని ప్రాంచైజీ నిర్ణ‌యించుకుందంట‌.

ఫ్రాంఛైజీ ఛైర్మన్ ప్రథమేశ్ మిశ్రాని ఇదే విష‌యంపై స్పందించారు.కోహ్లీనే జ‌ట్టును ఇన్ని రోజులు అత్యున్న‌తంగా న‌డిపించాడ‌ని, కాబ‌ట్టి మ‌ళ్లీ అత‌న్ని ఒప్పించి కెప్టెన్ గా కొన‌సాగిస్తామంటూ చెప్పుకొచ్చారు.

మ‌రి కోహ్లీ ఒప్పుకుంటాడో లేదో చూడాలి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube