వైరల్ వీడియో: మరోసారి తన భార్య అనుష్క పై ప్రేమను చూపించిన కోహ్లీ..!  

Virat Kohili, Anushkha Sharma, Dubai, IPL, Royal Challengers Bengaloore, Chennai Super Kings, Social Media, - Telugu @imvkohli, Anushkha Sharma, Chennai Super Kings, Dubai, Ipl, Royal Challengers Bengaloore, Social Media, Virat Kohili

విరాట్ కోహ్లీ అనుష్క శర్మ జంటకు దేశవిదేశాలలో, అలాగే సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.హై ప్రొఫైల్ సెలబ్రిటీస్ గా వీరు గుర్తింపు పొందారు.

TeluguStop.com - Kohli Once Again Showed His Love For His Wife Anushka

క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీ ఓ శిఖరంలా అత్యున్నత ఎత్తులో ఆయన నిలబడి ఉండగా, అతని భార్య అనుష్క శర్మ కూడా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతోంది.వీరిద్దరు జోడి ముచ్చటగా కనబడుతుంది.

ఫిల్మీ షూట్ కానీ, యాడ్ షూట్ కానీ వీరిద్దరి జంట మేడ్ ఫర్ ఈచ్అనేలా కనబడుతుంది.వీలైనంతవరకూ టీమిండియా జట్టు ఎక్కడ క్రికెట్ మ్యాచ్ జరిగిన అనుష్కశర్మ వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది.

TeluguStop.com - వైరల్ వీడియో: మరోసారి తన భార్య అనుష్క పై ప్రేమను చూపించిన కోహ్లీ..-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ కూడా మినహాయింపు లేకుండా అక్కడ కూడా వెళ్లి తన భర్త కెప్టెన్ గా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి వెళ్ళింది.

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ టోర్నమెంట్ అరబ్ కంట్రీస్ లో జరుగుతున్న కానీ అనుష్క శర్మ అక్కడికి చేరుకొని తన భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తోంది.

అయితే తాజాగా జరిగిన ఆదివారం మ్యాచ్ లో కూడా అనుష్కశర్మ ప్రత్యక్షమైంది.దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం లో రెడ్ కలర్ డ్రెస్ లో ఆవిడ సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా కనబడింది.

చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో లో ఆవిడ ప్రత్యక్షమైంది.అయితే అనుకోకుండా ఈ సీజన్ లో అనూహ్యంగా చతికల పడ్డ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మ్యాచ్ కాకపోతే ఆ మ్యాచ్ ను మాత్రం గెలిచింది.

ఇక ఈ విషయం పక్కనపెడితే తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ఫీల్డింగ్ చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో విరాట్ కోహ్లీ వారి డ్రెస్సింగ్ రూమ్ వద్ద నిల్చున్న ఆయన భార్య అనుష్క శర్మ చూసి భోంచేసావా అన్నట్లుగా చేతితో సంకేతాలు చేశాడు.

ఆ విషయాన్ని విరాట్ కోహ్లీ ఎంత క్యూట్ గా అడిగాడో ఆవిడ కూడా అంతే క్యూట్ గా అక్కడి నుంచి సమాధానమిచ్చింది.

తను భోజనం చేశాను అంటూ థమ్సప్ సింబల్ ను చూపించింది.అంతేకాదు నువ్వు వచ్చిన తర్వాత మళ్లీ కలిసి తిందాం అన్నట్లుగా ఆవిడ సంకేతాలు ఇచ్చింది.

ఈ రొమాంటిక్ సన్నివేశానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.ప్రస్తుతం అనుష్క శర్మ గర్భవతిగా ఉన్న విషయం అందరికీ విధితమే.

ఈ వీడియోపై నెటిజెన్స్ వారి స్టైల్స్ లో కామెంట్ చేస్తున్నారు.ఏది ఏమైనా విరాట్ కోహ్లీ తన భార్య పై చూపించే ప్రేమ పట్ల నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు.

#Anushkha Sharma #@imVkohli #ChennaiSuper #Dubai #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kohli Once Again Showed His Love For His Wife Anushka Related Telugu News,Photos/Pics,Images..