చాహ‌ల్ భార్య ద‌గ్గ‌ర డ్యాన్స్ నేర్చుకుంటున్న కోహ్లీ.. అదిరే స్టెప్పులు

Kohli Learning To Dance With Chahals Wife

క్రికెట్ ల‌వ‌ర్స్ కు విరాట్ కోహ్లీ ఆట అంటే ఎంత ఇష్ట‌మో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.మామూలుగానే అత‌ని ఆట కోసం అంతా ఎదురు చూస్తారు.

 Kohli Learning To Dance With Chahals Wife-TeluguStop.com

పైగా అత‌నికి సంబంధించిన ఏ విష‌యం అయినా స‌రే అభిమానుల‌కు పెద్ద పండుగ అని చెప్పాలి.అస‌లు మ‌న దేశంలో క్రికెట్ కుసంబంధించిన వార్త‌ల‌కు చాలా ప్రాధాన్య‌త ఉంటుంది.

పైగా టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉన్న ప్యాన్ ఫాలోయింగ్ కు అత‌ని గురించిన ఏ చిన్న వార్త అయినా స‌రే నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతుంద‌నే చెప్పాలి.మొన్న‌టికి మొన్న కూడా ఇలాంటి వార్త‌నే ఒక‌టి బాగా వైర‌ల్ అయింది.

 Kohli Learning To Dance With Chahals Wife-చాహ‌ల్ భార్య ద‌గ్గ‌ర డ్యాన్స్ నేర్చుకుంటున్న కోహ్లీ.. అదిరే స్టెప్పులు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కొంద‌రు దుర్మార్గులు కోహ్లీ బిడ్డ‌ను అత్యాచారం చేస్తామంటూ చెప్ప‌డంతో దేశ వ్యాప్తంగా నిర‌స‌న‌లు వెల్ల‌డ‌య్యాయి.సోష‌ల్ మీడియాలో కోట్లాదిమంది కోహ్లీకి మ‌ద్ద‌తు తెలిపారు.

ఇలా నిత్యం వార్త‌ల్లో ఉండే కోహ్లీ ఈ సారి కూడా హైలెట్ అయిపోయాడు.అయితే ఈ సారి క్రికెట్ ప‌రంగా కాకుండా కాస్త ఎంట‌ర్ టైన్ ప‌రంగా అయిపోయాడు.

అది కూడా అంద‌రికీ న‌చ్చే డ్యాన్స్ విష‌యంలో.టీమ్ ఇండియా స్పిన్న‌ర్ యుజ్వేంద్ర చాహ‌ల్ భార్య ధనశ్రీ వర్మతో కోహ్లీ డ్యాన్స్ స్టెప్పులు వేస్తున్నాడు.

పైగా ఆమెనే విరాట్ కు డ్యాన్స్ నేర్పుతున్న‌ట్టు ఇందులో క‌నిపిస్తుంది.

మామూలుగానే ధ‌న శ్రీ మంచి డ్యాన్స‌ర్ గా పేరు తెచ్చుకుంది.అయితే ఇప్పుడు కోహ్లీతో క‌లిసి స్టెప్పులు వేయ‌డంతో ఆమెకు మ‌రింత పాపులారిటీ వ‌చ్చేసింది.ఆమె ఈ వీడియోలో ఆర్‌సీబీ హుక్ స్టెప్ ఛాలెంజ్ ను వేసిన‌ట్టు క‌నిపిస్తోంది.

ఆర్సీబీకీ కెప్టెన్ గా విరాట్ కోహ్లీ ఉన్నారు.పైగా చాహల్ కూడా ఇదే టీమ్ లో ఉండ‌టం విశేషం.

ఇక కోహ్లీకి ధనశ్రీ హుక్ స్టెప్ నేర్పించడంపై నెటిజ‌న్లు విభిన్న ర‌కాలుగా స్పందిస్తున్నారు.ధ‌న శ్రీ మంచి డ్యాన్స‌ర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఆమెకు స్వ‌త‌హాగా ఓ యూ ట్యూబ్ చానెల్ కూడా ఉందండోయ్.

#Kohli #India #IndiaYuzvendra #Kohli #Dhana Sri

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube