టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అంటేనే దూకుడుకు మారుపేరుగా చెప్పొచ్చు.ఆయన ఏ పని చేసినా అందులో తన దూకుడే తనకు అత్యంత మేలు చేస్తుందని ఎక్కువగా ఆయన నమ్ముతుంటారు.
ఇంకా చెప్పాలంటే ఈ దూకుడే ఆయన్ను ప్రపంచ స్టార్ బ్యాట్స్ మెన్ ను చేసింది.ఆయనకు కోపం వస్తే ఆపడం ఎవరి వల్ల కాదు.
కాగా కోహ్లీని తప్పుబడుతూ అయితే ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ అయిన నిక్ కాంప్టన్ దారుణమైన కామెట్లు చేశాడు.కోహ్లి నోరు తెరిస్తే ఎక్కువగా బూతులే మాట్లాడుతాడంటే తన అధికారిక ట్విటర్ వేదికగా రాసుకొచ్చాడు.
ఇక 2012లో కోహ్లి తనను వేలెత్తి చూపిస్తూ ఘోరంగా దూసించడాన్ని తాను ఇంకా మర్చిపోలేదని, కోహ్లి అలాంటి దూషణలు చేసి అవనసరంగా తనను తాను తక్కువ చేసుకున్నాడంటూ కోహ్లిమీద అనుచిత వ్యాఖ్యలు చేశాడు.ఇక కాంప్టన్ చేసిన ట్వీట్ పై కోహ్లి అభిమానులు భగ్గుమంటున్నారు.
అన్ని వర్గాల నుంచి దారుణమైన విమర్శలు కాంప్ట్‌న్ మీద వస్తున్నాయి.ఇక విమర్శల దెబ్బకు కాంప్టన్ ట్వీట్‌ను చివరకు తొలగించాల్సి వచ్చింది.
అయితే కాంప్టన్ ట్వీట్ ను తొలగించడానికి ముందు కోహ్లీ ఫ్యాన్స్ చాలా దారుణ మైన కామెంట్లు చేశారు.

కాంప్టన్ కు ఇలాంటి ట్వీట్ చేయడానికి నిజంగా సిగ్గుండాలని, లేకపోతే అండర్సన్ గతంలో అశ్విన్‌ను దారుణంగా అవమానించినప్పుడు ఈయన ఎక్కడకు పోయాడంటూ ప్రశ్నించారు.ఇంకో ఫ్యాన్ అయితే దక్షిణాఫ్రికా క్రికెటర్ ఫిలాండర్‌ను బట్లర్ దారుణంగా అవమానించినప్పుడు కాంప్టన్ ఎక్కడున్నావంటూ కామెంట్ల వర్షం కురిపించడంతో దెబ్బకు కాప్ంటన్ దిగి వచ్చాడు.అయితే నిజానికి కోహ్లి కేవలం మ్యాచ్ గెలిచిన సందర్భంగా మాత్రమే అలా చేశాడని అతడి మనుసులో ఎలాంటి దురుద్ధేశం లేదని ఆయన అభిమానులు చెప్పుకొస్తున్నారు.
మొత్తానికి కాంప్టన్‌కు కోహ్లీ అభిమానుల సెగ బాగానే తగిలింది.