కంగనాపై కామెంట్స్‌ దాడి చేస్తున్న కోహ్లీ ఫ్యాన్స్‌  

Kohli Fans Comments On Kangana-panga King,team India,virat Kohli,కోహ్లీ ఫ్యాన్స్‌

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ తాజాగా పంగా అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఆ సినిమా ప్రమోషన్‌ సందర్బంగా కంగనా చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Kohli Fans Comments On Kangana-Panga King Team India Virat కోహ్లీ ఫ్యాన్స్‌

ఎప్పుడు ఏదో ఒక విషయమై స్పందిస్తూ వివాదాస్పదం అవ్వడం ఆమెకు అలవాటే.అయితే ఈసారి ఆమె కోహ్లీ ఫ్యాన్స్‌కు టార్గెట్‌గా మారింది.

కోహ్లీని తిట్టకుండానే ఆయనపై కామెంట్స్‌ చేసింది.ఆయన తీరుపై విమర్శలు చేసినట్లుగా మాట్లాడటంతో కోహ్లీ ఫ్యాన్స్‌ హర్ట్‌ అయ్యారు.
ఇంతకు కంగనా ఏమన్నదంటే.నేను మరియు కోహ్లీ చాలా దగ్గర పోలికలు కలిగి ఉన్నాము.

ముఖ్యంగా రెండు విషయాల్లో నేను కోహ్లీ చాలా సిమిలారిటీస్‌ను కలిగి ఉన్నామని చెప్పుకొచ్చింది.అందులో మొదటిది మేమిద్దరం కూడా కెరీర్‌ ఆరంభం నుండి వివాదాలతో వచ్చాం.

మాకు మొదటి నుండి వివాదాల వల్ల తలనొప్పి.ఇక రెండవ విషయం ఏంటీ అంటే మేము ఇద్దరం కూడా చాలా దుడుకు స్వభావం కలిగిన వాళ్లం.

ఇద్దరం ఏ విషయానికి అయినా వెంటనే రియాక్ట్‌ అవుతాం అంటూ కంగనా చెప్పుకొచ్చింది.

కోహ్లీతో కంగనా పోల్చుకోవడంపై ఫ్యాన్స్‌ రియాక్ట్‌ అవుతున్నారు.కంగనా ఫ్యాన్స్‌ ఔను అంటూ కామెంట్స్‌ చేస్తుండగా కోహ్లీ ఫ్యాన్స్‌ మాత్రం నీకు కోహ్లీకి పోలిక పెట్టుకోవడం ఏంటి అంటూ వ్యతిరేకిస్తున్నారు.ఎట్టి పరిస్థితుల్లో మీ ఇద్దరికి అస్సలు వర్కౌట్‌ అవ్వదు.

కోహ్లీ కి వివాదాలే లేవు.ఆయన దుకుడు స్వభావం కేవలం ఆటలో మాత్రమే.ఆయన గొప్ప వ్యక్తి.నీవు పబ్లిసిటీ కోసం వివాదాలను క్రియేట్‌ చేసే చీప్‌ మెంటాల్టీ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

.

తాజా వార్తలు