మ్యాచ్ మధ్యలో గొడవ పడ్డ కోహ్లీ, మరో ప్లేయర్.. వీడియో వైరల్..!

నిన్న అంటే బుధవారం రోజు బొలాండ్ పార్క్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే జరిగింది.ఈ మొదటి వన్డేలో టీమిండియా ఘోర పరాజయం చవి చూసింది.

 Kohli Clashes In Mid-match, Another Player Video Goes Viral, Match, Middlw, Fig-TeluguStop.com

ఈ మ్యాచ్ లో 36 పరుగుల తేడాతో భారత జట్టు ఓడిపోయింది.అయితే ఈ మ్యాచ్ మధ్యలో విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికా సారథి తెంబ బవుమాతో గొడవ పడ్డాడు.

వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.

నిన్న జరిగిన వన్డే మ్యాచ్ కు కేఎల్ రాహుల్ సారథ్యం వహించాడు.దక్షిణాఫ్రికా జట్టుకు కెప్టెన్‌గా తెంబ బవుమా వ్యవహరించాడు.అయితే ఈ మ్యాచ్‌లో బవుమా 143 బంతుల్లో 110 పరుగులు చేసి మెరుగ్గా రాణించాడు.8 ఫోర్లతో చెలరేగిన తెంబ బవుమా దుస్సేన్‌తో కలిసి నాలుగో వికెట్‌కి 204 పరుగుల పార్ట్‌‌నర్‌షిప్‌‌ క్రియేట్ చేశాడు.ఆ విధంగా దక్షిణాఫ్రికా 4 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేయగలిగింది.టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా ఈ వన్డేలో విజయం కేతనం ఎగుర వేసింది.

అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, తెంబ బవుమా మధ్య మాటల యుద్ధం కొనసాగింది.

తెంబ బవుమా చిన్న షాట్స్ ఆడుతూ సింగిల్స్‌ తీస్తూ తన స్కోరు పెంచడంపై దృష్టి సారించాడు.

మిడాన్‌లో అశ్విన్ ఫీల్డింగ్ చేస్తుండటంతో అతడి వైపే బంతిని హిట్ చేస్తూ వికెట్ల మధ్య వేగంగా పరుగులు తీస్తూ రన్స్ చేశాడు.మైదానంలో అశ్విన్ చురుగ్గా కదల్లేకపోవడం వల్ల చాలా సింగిల్స్ టీమిండియా వదులుకోవాల్సి వచ్చింది.

అయితే కేఎల్ రాహుల్ దీనికి పరిష్కారంగా అశ్విన్‌ని మిడాన్‌లో నుంచి తీసేసి అక్కడ విరాట్ కోహ్లీని ఫీల్డింగ్‌కు ఉంచాడు.ఆ తర్వాత కూడా బవుమా రెండు మూడు సార్లు సింగిల్స్ కోసం ప్రయత్నించాడు.

కానీ విరాట్ కోహ్లీ వేగంగా కదులుతూ ఒక్క సింగిల్ కూడా సమర్పించుకోలేదు.

దీనితో చేసేది లేక బవుమా వ్యూహాత్మకంగా సిల్లీ మిడాఫ్‌లోకి బంతిని పుష్ చేసి సింగిల్స్ సాధించాడు.ఈ అనూహ్య పరిణామంతో మరొక ఎత్తు వేసిన రాహుల్… కోహ్లీని సిల్లీ మిడాఫ్‌లో ఫీల్డింగ్‌కి మార్చాడు.ఈ క్రమంలోనే 35వ ఓవర్ లో ఓ బంతిని కవర్స్‌- మిడాఫ్ మధ్యలో పుష్ చేసి సింగిల్ కోసం బవుమా క్రీజు దాటి ముందుకు దూసుకొచ్చాడు.

కానీ బాల్ ని విరాట్ కోహ్లీ దొరకబుచ్చుకున్నాడు.దాంతో బవుమా రనౌట్ అవుతాననే భయంతో వెంటనే వెనక్కి వచ్చేశాడు.అయినప్పటికీ కోహ్లీ మాత్రం బంతిని అందుకుని వికెట్లపైకి బలంగా త్రో చేశాడు.అయితే అది కాస్త గురి తప్పి బవుమా మీదకు దూసుకొచ్చింది.

ఇలా మీదకు విసరడంతో బవుమా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు.అలాగే నోరు కూడా పారేసుకున్నాడు.తానేం తక్కువ కాదనట్లు విరాట్ కోహ్లీ అంతకుమించిన మాటలతో విరుచుకుపడ్డాడు.“రా… చూసుకుందాం” అన్నట్లు ముందడుగులు వేశాడు.దాంతో బవుమా వెంటనే వెనక్కి తగ్గాడు.అక్కడితో గొడవ సద్దుమణిగింది.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube