సన్మానం చేస్తామన్న బీసీసీఐ వద్దన్న కోహ్లీ... అసలేం జరుగుతోంది..

భారత క్రికెట్ నియంత్రణ మండలికి, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి కొన్ని రోజుల నుంచి సరిగ్గా పడడం లేదు.ఎప్పుడైతే విరాట్ కోహ్లీ తన టీ20 కెప్టెన్సీ వదిలేసుకుంటున్నట్లు ప్రకటించాడో ఇక అప్పటి నుంచి కోహ్లీకి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్లుగా ఉంది.

 Kohli At Bcci To Be Honored Actually It Is Happening , Bcci, Kohli-TeluguStop.com

కొన్ని రోజుల వ్యవధిలోనే అతడి నుంచి వన్డే కెప్టెన్సీని కూడా బీసీసీఐ లాగేసుకుంది.వన్డే కెప్టెన్సీ విషయంలో పెద్ద దుమారమే చెలరేగింది.

కోహ్లీ విషయంలో బీసీసీఐ తప్పుగా ప్రవర్తిస్తోందని కొంత మంది ఆరోపించారు.మరికొంత మంది కోహ్లీదే తప్పు అంటూ బీసీసీఐ కి మద్దతు పలికారు.

 Kohli At BCCI To Be Honored Actually It Is Happening , BCCI, Kohli-సన్మానం చేస్తామన్న బీసీసీఐ వద్దన్న కోహ్లీ#8230; అసలేం జరుగుతోంది..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదంతా కొన్ని రోజుల ముందు వరకు జరిగింది.కానీ ఇండియా అదే గొడవలతో సౌతాఫ్రికా సిరీస్ ఆడింది.

టెస్టు సిరీస్ ను ఇండియా అప్పనంగా సౌతాఫ్రికాకు వదిలేసింది.ఇది జరిగిన తర్వాత కోహ్లీ తన టెస్టు కెప్టెన్సీని కూడా వదిలేస్తున్నట్లు ప్రకటించాడు.

కానీ అంతకు ముందే కోహ్లీకి బీసీసీఐ నుంచి ఓ ఆఫర్ వచ్చిందని ప్రచారం జరుగుతోంది.అదేంటంటే.

కోహ్లీ ఇప్పటి వరకు 99 అంతర్జాతీయ టెస్టులు ఆడాడు.అతడు కెప్టెన్ గా అందించిన సేవలకు గాను అతడిని బీసీసీఐ ఘనంగా సన్మానించాలని చూసింది.వందో టెస్టును బెంగుళూరు చిన్న స్వామి స్టేడియంలో (కోహ్లీకి బెంగుళూరు స్టేడియం రెండో హోమ్ గ్రౌండ్ వంటిది.ఎందుకంటే అతడు ఐపీఎల్లో చాలా రోజుల నుంచి బెంగుళూరుకే ఆడుతున్నాడు.

) ఘనంగా సన్మానం చేయాలని భావించింది.తాను టెస్టు కెప్టెన్సీని కూడా వదిలేస్తున్న విషయాన్ని కెప్టెన్ కోహ్లీ బీసీసీఐ అధికారులకు ఫోన్ ద్వారా తెలిపాడు.

దీంతో వారు అతడిని ఇంకో టెస్టుకు కెప్టెన్సీ చేయాలని వందో టెస్టులో ఘన సన్మానం ఏర్పాటు చేస్తామని అన్నారట.కానీ కోహ్లీ మాత్రం బీసీసీఐ చెప్పింది ఫాలో కాలేదని అంటున్నారు.

అసలు సన్మానాలతో జరిగేది ఏమీ ఉండదని కోహ్లీ అన్నట్లు తెలుస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube