కోడెల మృతికి వైకాపా కారణమా?

మాజీ మంత్రి, మాజీ స్పీకర్‌ తెలుగు దేశం పార్టీ సీనియర్‌ నాయకుడు కోడెల శివ ప్రసాద్‌ ఆత్మహత్య చేసుకోవడంపై తెలుగు దేశం పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రతి ఒక్క తెలుగు దేశం పార్టీ సీనియర్‌ నాయకుడితో కోడెలకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

 Kodela Sivaprasad Diedthe Reasonis Ycpparty-TeluguStop.com

మూడు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించి గుంటూరు జిల్లాపై తనదైన ముద్రను వేసిన కోడెల మృతికి రాజకీయ వేదింపులు కారణం అంటూ తెలుగు తమ్ములు విమర్శలు చేస్తున్నారు.

వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుండి లెక్క లేకుండా ఇష్టం వచ్చినట్లుగా కోడెలపై ఆయన కుటుంబ సభ్యులపై వైకాపా ప్రభుత్వం కేసులు నమోదు చేసింది.

దాంతో ఆయన తీవ్ర మనస్థాపంకు గురవ్వడంతో పాటు, ఆయన ఇప్పటికే ఒసారి గుండె పోటుతో బాధ పడ్డారు.ఆయన్ను ఇంకా ఇంకా వైకాపా ప్రభుత్వం వేదించడంతో చివరకు ఉరి వేసుకున్నట్లుగా తెలుగు దేశం పార్టీ నాయకులు పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారం ఉందనే అహంకారంతో కోడెలను దారుణంగా అవమానించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube